మధుమేహం ఉంటే అవోకాడో, అవిసెగింజలు వాడొచ్చా..?

-

చేపకింద నీరులా విస్తరిస్తున్న షుగర్‌ వ్యాధిని ముందు నుంచి హెల్తీ లైఫ్‌స్టైల్‌తోనే అరికట్టగలుగుతాం.. షుగర్‌ వచ్చాక కూడా మంచి జీవనశైలి పాటిస్తేనే వ్యాధి మాట వింటుంది లేదంటే ప్రాణం మీదకు వస్తుంది. డయబెటీస్‌ ఉన్నవారు డైలీ షుగర్‌ లెవల్స్‌ తగ్గించేవి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. అది టాబ్లెట్‌ అయినా లేక ఇంటి చిట్కాలు అయినా.. మనం ఇప్పటికీ ఏవి తినాలి, ఏవి తినొద్దు అని చాలానే మాట్లాడుకున్నాం. మీకు అవిసె గింజలు గురించి తెలిసే ఉంటుంది. ఇవి కూడా షుగర్‌ పేషంట్లకు బాగా మేలు చేస్తాయట. ఇంకా కొన్ని ఉన్నాయి.. అవేంటంటే..

నట్స్ – మధుమేహ బాధితులు షుగర్ కంట్రోల్ చేయడానికి డైలీ నట్స్ తీసుకోవచ్చు. నట్స్‌లో జీడిపప్పు, వాల్‌నట్‌లు, బాదం, వేరుశెనగ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్‌తో కూడిన నట్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

అవోకాడో- అవకాడోలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ గ్లైసెమిక్ ఆహారం శరీరంలో సహజ ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది షుగర్‌ పేషంట్స్‌కు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందనంటలో ఎలాంటి సందేహం లేదు.

ఆలివ్, అవిసె గింజల నూనె- ఆలివ్, అవిసె గింజల నూనె మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆలివ్ నూనెలో టైరోసోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత, మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అవిసె గింజల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవిసె గింజల నూనెలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

కొన్ని రకాల చేపలు- ఆహారంలో హెర్రింగ్, సాల్మన్, సార్డినెస్ వంటి కొన్ని రకాల చేపలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు నాన్ వెజ్ తీసుకుంటే.. ఈ ఫిష్ వెరైటీలను వారానికి రెండు సార్లైనా తినేయొచ్చు. చేపలు వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news