ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు డైట్ లో వీటిని తీసుకుంటే ఈ సమస్యలు వుండవు..!

-

అన్నిటి కంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం సరిగా ఉండాలంటే ఆహారం మంచిదై ఉండాలి. అదే విధంగా మంచి జీవన విధానాన్ని పాటించడం, వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ రోజు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనేది న్యూట్రీషనిస్ట్ చెప్పారు. ఈ నెలల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి.

దీని కారణంగా డిహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. కనుక పిల్లల నుండి పెద్దల వరకు హార్ట్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, యూరినరీ సమస్యలు మొదలైన సమస్యలు రాకుండా ఉండాలి అంటే వీటిని తీసుకోమని న్యూట్రిషనిస్ట్ చెప్పారు. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం చూసేద్దాం.

ఈ కూరగాయలు తీసుకోవాలి:

వేసవిలో ఆనపకాయ:

ఆనపకాయ లో సోడియం, పొటాషియం మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలని తొలగిస్తుంది మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆనపకాయతో జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఫిజికల్ ఎనర్జీ బాగుంటుంది. అదే విధంగా ఒంట్లో నీళ్లు కూడా చేరుతాయి.

వేసవిలో పుదీనా:

పుదీనా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పుదీనా, జీలకర్ర, మిరియాలు కలిపి జ్యూస్ చేసుకుని తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నిమ్మ రసం తో పుదీనా జ్యూస్ తాగితే ఒబెసిటీ తగ్గుతుంది.

వేసవిలో కీర:

వేసవిలో ఎండలు మండిపోతాయి. ఇటువంటి సమయంలో రిలీఫ్ పొందాలంటే కీరా బాగా సహాయ పడుతుంది. విటమిన్స్, యాంటి ఆక్సిడెంట్స్, బీటా-కెరోటిన్ దీనిలో ఉంటాయి ఇది ఒంటి నుండి వేడిని తొలగిస్తుంది. అలానే బాడీని చల్లగా ఉంచుతుంది. కాబట్టి వీటిని తప్పకుండా ఈ నెలల్లో తీసుకోండి దీంతో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news