కొవ్వుని కరిగించుకోవాలంటే ఉదయాన్నే ఈ విధంగా అనుసరించండి..!

-

చాలా మంది ఫ్యాట్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారం జీవన విధానాన్ని బట్టి కొవ్వు అనేది ఉంటుంది. అయితే కొవ్వు కరిగించుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా కొవ్వును కరిగించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారా…?, అయినప్పటికీ ఫలించలేదా..? అయితే మీకోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి.

వీటిని అనుసరిస్తే తప్పకుండా కొవ్వు కరిగిపోతుంది. కొవ్వుని కరిగించుకోవడానికి వ్యాయామ పద్ధతులు బాగా ఉపయోగపడతాయని చాలామంది పాటిస్తూ ఉంటారు. అయితే వాటి కంటే కూడా ఈ సులభమైన చిట్కాలను అనుసరిస్తే తప్పక కొవ్వు కరిగిపోతుంది. దీనికోసం మీరు సాయంత్రం పూట ఒక టీ స్పూన్ జీలకర్రని నీళ్ళల్లో నానబెట్టాలి.

రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే నానబెట్టిన జీలకర్రని ఖాళీకడుపుతో తీసుకోవాలి. అయితే అందులో మిగిలి ఉన్న నీళ్లను మరిగించి నిమ్మరసం వేసి దానిలో ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తాగేయండి. జీలకర్ర తీసుకోవడం వల్ల కొవ్వుని అది చేరనివ్వదు. అలానే ఒంట్లో ఉండే కొవ్వు కూడా కరిగిపోతుంది. అయితే ఇలా ఈ పద్ధతిని ఫాలో అయినప్పుడు అల్పాహారం తీసుకోకండి.

ఉదయాన్నే దీన్ని తీసుకుని మధ్యాహ్నం భోజనం చేసేయండి. భోజనం చేసే ముందు ఒక ప్లేట్ సలాడ్ తీసుకుంటే కూడా మంచిది. అలానే రాత్రి నిద్ర పోవడానికి రెండు నుండి మూడు గంటలు ముందే భోజనం తినేయాలి. అప్పుడే జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా ఈ టిప్స్ ని పాటిస్తే కొవ్వు రాకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news