రావి చెట్టుకు పూజలు చేస్తారు.. కానీ ఇంట్లో ఎవరూ పెంచుకోరు. ఊర్లలో అయితే ఖాళీ ప్రదేశంలో రావి చెట్టు చుట్టూ అరుగులు కట్టి.. పెద్దోళ్లంతా ముచ్చట్లు చెప్పుకునేవారు. రావి చెట్టుకింద కుర్చోవడం అనేది కేవలం టైంపాస్ మాత్రమే కాదు.. దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. 24 గంటలు ఆక్సిజన్ ను విడుదల చేసే చెట్లలో రావి చెట్టు ఒకటి. . రావి చెట్టు దగ్గర ఉంటే.. మంచి ప్రాణవాయివు వెళ్తుంది. రావి ఆకులో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఈరోజు మనం రావి ఆకుపై సైంటిఫిక్ గా తేల్చిన కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలామంది కషాయాలు తాగుతున్నారు. రావి ఆకులతో కూడా కషాయం చేుసుకుని తాగితే మంచి ప్రయోజనాలు ఉన్నాయని 2010వ సంవత్సంరలో ఆచర్య బీఎం రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ- బెంగుళూరు( Acharya BM Reddy College Of Pharmacy- Bangalore) వారు పరిశోధన చేసి తేల్చారు.
రావి ఆకుల కషాయాన్ని తాగడం ద్వారా ప్రేగుల్లో ఉండే నులిపురుగు చచ్చిపోతున్నాయని వీళ్లు అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రేగుల్లో నులిపురుగులు ఎక్కువైతే.. రక్తాన్ని తాగేస్తాయి, రక్తహీనతకు కారణం అవుతాయి. దీనివల్ల గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇలాంటి ఇబ్బందులను తగ్గించడానికి ఈ ఆకుల కషాయం మంచింది. ఈరోజుల్లో చాలామంది పిల్లల్లో ఎదిగే వయసులో సరిగ్గా హైట్ పెరగడం లేదు. గ్రోత్ ఆగిపోవడానికి, కడుపునొప్పి రావడానికి ఈ నులిపురుగులే కారణం.
రావి ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్ Piperlangumine, Piperine ఇవి మన రక్షణ వ్యవస్థలో ఉండే బీ-లింఫోసైట్స్( B lymphocytes) వీటిని బాగా యాక్టీవేట్ చేసి.. ఎక్కువ యాంటీబాడీస్ ఉత్పత్తి బాడీలో జరిగేట్లు ఈ రావిఆకు కషాయం ఉపయోగపడుతుంది.
చాలామంది మూర్ఛవ్యాధితో బాధపడుతుంటారు. ఫిట్స్ సివియారిటీ తగ్గించడానికి, ఫిట్స్ తక్కువసార్లు వచ్చేట్లు చేయడానకి రావి ఆకుల కషాయం ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా సెరటోనిన్ (Serotonin) లాంటి ఇవి న్యూరోట్రాన్సిమీటర్స్( Neurotransmitters) లాగా బాగా ఉపయోగపడతాయి. వీటి యాక్టివిటీని బాగా మెరుగు చేసి.. ఫిట్స్ రాకుండా చేయగలుగుతాయి.
రావి ఆకుల కషాయంలో మైరసిటిన్( Myricetin), క్యాఫిరాల్( Kaempferol) ఎక్కువగా ఉండటం వల్ల.. దగ్గు, కఫం, శ్లేష్మాలు, ఆస్తమా ఉన్నప్పుడు బాగా తొలగించేట్లు చేస్తాయట. వేడి వేడి కషాయాన్ని తేనె కలుపుకుని తాగితే.. ఈ సమస్యల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
రావి ఆకులను పేస్ట్ చేసి.. ఆ పసరు తీసుకుని దెబ్బలు, పుళ్లు మీద పూస్తే.. మానిపించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు.
ఇందులో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్( Phenolic Compounds) పవర్ ఫుల్ యాంటి బాక్టీరియల్ ఏజెంట్స్ లా పనికొస్తున్నాయట. ఈ కషాయం తీసుకున్నప్పుడు హానీ కలిగించే బ్యాడ్ బాక్టీరియాలు చనిపోవడానికి రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే గుడ్ బాక్టీరియా డవలప్ చేయడానికి కూడా ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి.. రావి చెట్టు దగ్గర్లో ఉంటే.. డైలీ ఒక గంటపాటైనా.. రావి చెట్టు గాలిపీల్చుకోవడానికి, కషాయం తాగేందుకు ప్రయత్నించండి మరీ..!
– Triveni Buskarowthu