హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. నిన్న మాదాపూర్ గుట్టల బేగంపేట వడ్డెర కాలనీ లో కలుషిత నీరు తాగిన బాధితులు సంఖ్య 76 కి చేరింది. ఈ బాధితులు లో 30 మంది చిన్నారులు ఉండగా.. కలుషిత నీరు తాగడం వలనే అనారోగ్యానికి కారణం అంటున్నారు కాలనీ వాసులు.
అందరూ ఒకే లక్షణాలు తో హాస్పిటల్ లో చేరారు. వాంతులు, విరేచనాలు, జ్వరం తో బాధపడుతున్న బాధితులు.. బస్తి దవాఖాన,కొండాపూర్ ఏరియా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఇదే కాలనికి చెందిన బీమయ్య రెండు రోజుల క్రితం ఇదే లక్షణాలతో మృతి చెందాడు.
ఈ రోజు భూమయ్య కుటుంబము లో మరొక ఇద్దరు ఇదే లక్షణాలు తో హాస్పిటల్ లో చేరారు. వాటర్ పొల్యూషన్ జరగలేదని జీ హెచ్ ఎం సీ, వాటర్ బోర్డ్ అధికారులు అంటున్నారు. ఫుడ్ పాయిజన్, వాటర్ పాయిజన్ అయితేనే ఇలాంటి కంప్లైంట్ లు వస్తాయంటున్నారు డాక్టర్లు. దీంతో ఆ కాలనీ వాసులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.