చలికాలం అంటేనే సకల రోగాలకు కేరాఫ్. ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉందంటే..ఇక జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు తిష్టేసుకుంటాయి. వీటినుంచి తప్పించుకోవడానికి మనం ఆరోగ్యకరమైనా ఆహారాలను, పోషకవిలువలతో కూడిన డైట్ ని ఫాలో అవుతాం. అయితే తెలుగువారి వంటకాల్లో అధిక ప్రాధాన్యత కలిగిన గోంగూరను ఈ సీజన్ లో తినొచ్చా లేదా అనేది కాస్త సందేహం. గోంగూరతో చేసే వంటకాలు రుచి మామూలుగా ఉండదు. ఆయుర్వేదంలో గోంగూరలో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు చెప్తారు.
ఈ సీజన్ లో శరీరానికి బాగా వేడినిచ్చే ఆహార పదార్ధాలను తీసుకోవటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాంటి వాటిలో గోంగూర ఒకటి. గోంగూరతో వివిధ రకాల ఆహారాలను తయారు చేసుకుని తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గోంగూర పప్పు, గోంగూర చట్నీ, గోంగూర చికెన్, ఇలా రుచికరమైన వంటకాలను చేసుకుని హ్యాపీగా తినవచ్చు. చలికాలంలో గోంగూర తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
గోంకూరలో క్యాల్షియం కూడా బాగా ఉంటుంది. ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది. కంటి సంబంధిత వ్యాధులను దూరం చేయగల శక్తి గోంగూరకు ఉంది. రేచీకటితో ఇబ్బందిపడేవారికి గోంగూర బాగా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ ఏ, బి 1, బి 2, బి 9 తోపాటు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం, ఐరన్ లాంటి లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో చెక్కర స్థాయిని తగ్గించి షుగర్ రాకుండా చేస్తాయి. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఇందులో ఉండే కాల్షియం , ఐరన్ ఎముకలను, కండరాలను బలేపేతం చేసేందుకు దోహదపడతాయి. దగ్గు, ఆయాసం వంటి సమస్యలనున్న వారికి గోంగూర బాగా ఉపకరిస్తుంది. ఆ సమస్యల నుండి వారికి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. గోంగూర చికెన్ కర్రీ తింటే పురుషుల్లో సంతానోత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ సీజన్ లో..ఎవరికైనా గోంగూరను తినటంలో సందేహం ఉంటే..ఎలాంటి డౌట్ లేకుండా లాగించేయొచ్చు.
-Triveni Buskarowthu