చాలా శాతం మంది మాంసాహారం తీసుకోకుండా, శాఖాహారం మాత్రమే తింటారు. శాకాహారులు కొన్ని ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు అవి శాకాహారమా లేక మాంసాహారమా అని సందేహిస్తారు. ఆ సందేహంలో పుట్టగొడుగులు కూడా ఒకటి. కొంతమంది వాటిని శాఖాహారంగా భావించి తింటారు. అయితే మరి కొందరు ఇవి మాంసాహారం అని తీసుకోరు. పైగా పుట్టగొడుగులను వెజిటేరియన్ చికెన్ అని కూడా పిలుస్తారు. పుట్టగొడుగులు మాంసాహారమా లేక శాకాహారమా అని అనుకుంటే, దీనిని తెలుసుకోవాల్సిందే.
పుట్టగొడుగులు శాఖాహారం మరియు మాంసాహారం రెండూ కాదు. ఇవి ఫంగస్ జాతికి చెందినవి. మొక్కలకు ఉండే విధంగా వీటికి వేర్లు ఉండవు మరియు ఇవి చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి పోషణ తీసుకుని ఎదుగుతాయి. అందువలన పుట్టగొడుగులు శాఖాహారం కూడా కాదు. కొంత శాతం మంది శాఖాహారులు కూడా పుట్టగొడుగులు తీసుకోరు. ఎందుకంటే అవి భూమి కింద పెరుగుతాయి మరియు వీటిని భూమి నుండి తీయడానికి ఎన్నో చిన్న జీవుల ప్రాణాలపై ప్రభావం ఉంటుంది అని భావిస్తారు. కాకపోతే, సైన్స్ ప్రకారం పుట్టగొడుగులను శాఖాహారంగా పరిగణించవచ్చు. వీటి వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరియు పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా కూడా ఉంటాయి.
కనుక తరచుగా వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్-డి2, విటమిన్ డి అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన ఎముకలు మరియు కండరాలు బలంగా మారుతాయి. ఎవరైతే విటమిన్ డి పోషక లోపంతో బాధపడుతున్నారో, వారు వీటిని కచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా పుట్టగొడుగులను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వలన సెల్ డామేజ్ తగ్గుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా పుట్టగొడుగులు సహాయపడతాయి. తరచుగా పుట్టగొడుగులను తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది.