నడుము నొప్పి ఎక్కువగా వస్తోందా..? అయితే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది నడుము నొప్పి సమస్యతో బాధ పడుతూ ఉంటారు. నడుము నొప్పి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి తట్టుకోలేనంత నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన జీవన శైలిని అనుసరించకపోవడం వలన వెన్నునొప్పి నడుం నొప్పి వస్తూ ఉంటాయి అలానే క్యాల్షియం విటమిన్ లోపం ఉండడం వలన కూడా ఈ సమస్యలు వస్తాయి.

వెన్నుపూస వ్యాధులు, కండరాలపై ఒత్తిడి కలిగినా కూడా నడుం నొప్పి వస్తూ ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సార్లు త్వరగా మనం పనులు చేసుకోవాలన్న హడావిడిలో హఠాత్తుగా వంగడం లేవడం వంటివి చేస్తూ ఉంటాము. ఇటువంటి వాటి వలన కూడా నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. విపరీతంగా నడుం నొప్పి వస్తున్నట్లు అయితే కచ్చితంగా డాక్టర్ని కన్సల్ చేయాలి అలానే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వడం కూడా మంచిదే.

నడుము నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు:

వాకింగ్ చేయండి:

వాకింగ్ చేయడం వలన నడుము నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది పైగా వాకింగ్ వలన ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఎక్కువ సేపు కూర్చుని ఉంటారు అటువంటి వాళ్ళు నడుస్తూ ఉంటే ఈ సమస్య ఉండదు.

సరైన పోస్టర్ ని మెయింటెన్ చేయండి:

కూర్చునప్పుడు సరైన పోస్టర్ ఉంటే కూడా ఈ సమస్య కలగకుండా ఉంటుంది.

తీసుకునే ఆహారం:

తీసుకునే ఆహారం బట్టి కూడా ఆరోగ్యం ఆధారపడి ఉంది. మంచి ఆహారం తీసుకోవడం వలన ఎటువంటి సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.

ఒత్తిడిని దూరం చేసుకోండి:

ఒత్తిడి వలన కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా హాయిగా ఉండేందుకు చూసుకోండి.

బరువులు ఎత్తినప్పుడు చూసుకోండి:

బరువులు ఎత్తేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి బరువైన వస్తువుల్ని ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలానే వ్యాయామం నిద్ర వంటి వాటి వలన కూడా నడుం నొప్పి లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version