లివర్ ఆరోగ్యం బాగుండాలా..? అయితే డైట్ వీటిని తప్పక తీసుకోవాల్సిందే..!

-

ఆరోగ్యం పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా లివర్ సమస్యలేమీ లేకుండా చూసుకోవాలి. లివర్ ఎన్నో రకాల పనులను చేస్తుంది. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, బైల్ ని ప్రొడ్యూస్ చేయడానికి లివర్ అవసరం.

అదే విధంగా లివర్ ఎన్నో పనులను చేస్తుంది. ఆల్కహాల్ ని, మందులని బ్రేక్ చేయడానికి లివర్ మనకి బాగా ఉపయోగ పడుతుంది. నిజానికి లివర్ ని మంచి కండిషన్లో పెట్టుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా లివర్ ని మంచిగా ఉంచుకోవాలి. అయితే లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.

టీ:

లివర్ ఆరోగ్యానికి టీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్ బాగుంటుంది. లివర్ లో ఉండే ఫ్యాట్స్ కరిగిపోతాయి.

కాఫీ:

కాఫీ కూడా లివర్ సమస్యలను కరిగిస్తుంది. లివర్ డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది.

ఓట్స్:

ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఓట్స్ తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు కలగవు.

పండ్లు మరియు కూరగాయలు:

సిట్రస్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కూడా లివర్ సమస్యలు రావు. కనుక ద్రాక్షపండ్లను, కమల పండ్లని తీసుకుంటూ ఉండండి. కూరగాయలు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బ్రోకలీ, కాలిఫ్లవర్, పాలకూర కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి వీటిని కూడా రెగ్యులర్ డైట్ లో తీసుకోండి.

టోఫు:

టోఫు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లివర్ సమస్యలు రాకుండా చూస్తుంది. అదే విధంగా నట్స్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం బాగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకుని లివర్ సమస్యలకు దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news