ఇలా ఈజీగా కొలెస్ట్రాల్ ని తగ్గించుకోండి..!

చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలలో కొలెస్ట్రాల్ సమస్య ఒకటి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి అందుకని కొలెస్ట్రాల్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల డ్రింక్స్ ని యాడ్ చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే మరి ఎటువంటి వాటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అనేది చూద్దాం. అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకునే డ్రింక్స్ వివరాల్లోకి వెళితే…

గ్రీన్ టీ :

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ ని ప్రిఫర్ చేస్తారు. అయితే గ్రీన్ టీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కనుక రెగ్యులర్ గా గ్రీన్ టీ ని తీసుకోండి.

టమాటా జ్యూస్:

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం టమాటా జ్యూస్ కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడే వాళ్ళు టమాటా జ్యూస్ తీసుకుంటే కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

కోకో డ్రింక్:

కోకో డ్రింక్ ద్వారా కూడా మనం కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకో వచ్చు. ఇలా వీటిని మీ డైట్ లో చేర్చుకొని కొలెస్ట్రాల్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.