Monsoon health tips : వానాకాలం మొదలైంది అంటే అందరిలో గుబులు మొదలవుతుంది. వానాకాలంలో అనారోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరూ కంగారు పడుతూ ఉంటారు. ఈ సీజన్ మొదలవుతోంది అంటేనే బయట నీళ్లు తాగకుండా, బయట ఆహారం తినకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ చిన్న తప్పు వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వానా కాలంలో ఎటువంటి మల్టీ విటమిన్స్ తీసుకోవాలి..? రోగనిరోధక శక్తిని పెంచుకునే అవసరం చాలా ఉంది. వర్షాకాలంలో పోషక విలువలతో కూడిన వాటిని తీసుకోవాలి.
పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ద:
ప్రతిరోజు అల్పాహారాన్ని అధిక మోతాదులో తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, జింక్, మెగ్నీషియం శక్తిని పెంపొందిస్తాయి. ఉసిరి, సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగులు, సోయాబీన్స్ లో విటమిన్ డి, బాదం, వాల్నట్స్ లో విటమిన్ ఈ, కిడ్నీ బీన్స్, జీడిపప్పులో మెగ్నీషియం ఉంటాయి. ప్రతిరోజు ఈ ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకునేటట్టు చూసుకోవాలి.
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మరి కొన్ని టిప్స్:
రీసెర్చ్ ప్రకారం మన బరువులో 75% నీళ్లు ఉంటాయి. డిహైడ్రేషన్ సమస్య లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.
శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బ్యాక్టీరియా, క్రిములు బారిన పడకుండా చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, డాన్సింగ్ వంటి వాటిని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.
మల్టీ విటమిన్స్ ని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇలా వానా కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కచ్చితంగా సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.