సహజంగా ఇంట్లో కూర్చున్నప్పుడు కాళ్లు కదుపుతూ ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు అలా చేయొద్దు అని చెబుతూ ఉంటారు. అయితే ఇటువంటి చిన్న పొరపాట్లు కూడా మన పై ఎంతో ప్రభావం చూపుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూర్చున్నప్పుడు కాళ్లు కదపడం వలన ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మరియు ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. పెద్దవాళ్లు హెచ్చరించినా సరే దానిని లెక్కచేయకుండా వదిలేయకూడదు. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుంటే మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూర్చున్నప్పుడు కాళ్లు కదపడం వలన ప్రతికూల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇలా చేయడం వలన చంద్రుని స్థానం పై ప్రతికూల ప్రభావం కనబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మానసిక ప్రశాంతతకు మరియు భావోద్వేగాలకు చిహ్నం. అయితే చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఒత్తిడి, భయం, మానసిక సమస్యలు వంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటి వాతావరణం పై కూడా ఎంతో ప్రభావం ఉంటుంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం, ప్రశాంతతను కోల్పోవడం వంటి మొదలైన సమస్యలు వస్తాయి.
అంతేకాకుండా కూర్చుని కాళ్ళను కదపడం వలన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోవాల్సి వస్తుంది, అంటే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయి. చాలా మందికి కాళ్లు కదపడం ఎంతో అలవాటుగా మారుతుంది. తినేటప్పుడు కూడా కాళ్ళను కదుపుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన తినే ఆహారాన్ని అవమానించినట్లే అంటే అన్నపూర్ణాదేవిని అనుమానించినట్లు అర్థం. కనుక ఈ అలవాటును తగ్గించుకుంటే ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పూజ చేస్తున్న సమయంలో కూడా పాదాలను కదిలించకూడదు. ఇలా చేయకపోవడం వలన ఏకాగ్రత పై ఎంతో ప్రభావం పడుతుంది. కనుక పాదాలని కలుపుతూ ఉండకుండా అంకిత భావంతో పూజిస్తే దేవతల అనుగ్రహం ఉంటుంది.