పడుకునే ముందు తినకూడని ఆహారాలు.. తిన్నారో వ్యాధులను కొనుక్కున్నట్టే.

మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యం. ముఖ్యంగా రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాని మీద కొంచెం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రాత్రిపూట ఎలాంటి శ్రమ లేకుండా పడుకుంటాం కాబట్టి అధిక భోజనం చేయకుడదు. తేలికపాటి ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. లేదంటే సరిగ్గా జీర్ణం అవకుండా నిద్ర సరిగ్గా పట్టకపోవడాలు, దాన్నుండి డయబెటిస్, ఒత్తిడి మొదలగు వాటికి దారి తీసే అవకాశం ఉంది.

రాత్రిపూట ఎలాంటి ఆహారాలు ముట్టుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్రై చేసిన ఆహారాలు

ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళ దుంప చిప్స్ మొదలగునవి అస్సలు తినవద్దు. వీటి వల్ల నిద్రాభంగం కలుగుతుంది. అంతేకాదు గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా శరీరంలో నీటిని తగ్గిస్తాయి. మహిళల్లో హార్మోన్ల మార్పుకు కారణం అవుతాయి.

కాఫీ, చాక్లెట్

కాఫీలు నిద్రకు ప్రతిబంధకాలు.

ఇందులో ఉండే అమైనో ఆమ్లం కారణంగా నిద్ర తొందరగా రాదు. చాక్లెట్లు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల ఉదయం పూట మాత్రమే వాటిని తినాలి.

స్పైసీ ఫుడ్స్

ఎక్కువ కారం ఉన్న ఆహారాలు తొందరగా జీర్ణం కావు. దానివల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. అందుకే తేలికపాటి తొందరగా జీర్ణం అయ్యే వాటిని మాత్రమే తీసుకోవాలి.

తీపి పదార్థాలు

అన్నం తినగానే డెజర్ట్స్ తినడం చాలా బాగుంటుంది. కానీ రాత్రిపూట వాటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దానివల్ల దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిపూట శారీరక శ్రమ్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలాఅంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.