టీ కాఫీ లకి ఎంత దూరంగా ఉండాలన్నా అవ్వడం లేదా..? ఇలా చేస్తే సరి..!

-

చాలా మంది ఎక్కువగా కాఫీ టీ లని తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎక్కువగా కాఫీ టీలు ని తాగుతూ ఉంటారా..? కాఫీ టీల నుంచి దూరంగా ఉండడానికి వీటిని ఫాలో అవ్వండి చాలా మంది ఎంత ప్రయత్నించినప్పటికీ కాఫీ టీ లకి దూరంగా ఉండలేరు. రోజూ కాఫీ టీలని తీసుకోకుండా ఉండాలని అనుకున్నప్పటికీ కుదరదు. మీకు కూడా ప్రతి రోజు ఇదే జరుగుతుంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. అప్పుడు కచ్చితంగా కాఫీ టీలకి దూరంగా ఉండొచ్చు.

కాఫీ టీ లకి బదులుగా పసుపు పాలని తీసుకుంటూ ఉండండి లేదంటే యాలుకలు ఫ్లేవర్ తో ఉన్న బాదం మిల్క్ ని కూడా తయారు చేసి తీసుకోండి వీటి వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాఫీ టీ లకి బదులుగా ప్రెజర్వేటివ్స్ లేని హోమ్ మేడ్ సూప్స్ వంటివి కూడా మీరు తీసుకోవచ్చు.
టీ కి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు హోమ్ మేడ్ హెర్బల్ టీ ని తీసుకోండి. దాల్చిన చెక్క, తులసి, లవంగం, యాలకులు, అల్లం వంటి వాటితో హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు.
అలానే ఆర్గానిక్ తేనె, బెల్లం వంటివి మీరు చక్కెరకి బదులుగా ఉపయోగించుకోవచ్చు. కావాలంటే మీరు లెమన్ గ్రాస్, గ్రీ టీ, స్ట్రాబెరి టీ వంటి వాటిని కొనుగోలు చేసి వాడొచ్చు ఇవి కూడా టీ కంటే మంచివే.
ప్రతి రోజు ఉదయాన్నే టీ తాగే వాళ్ళు టీ కి బదులుగా నిమ్మరసం తీసుకుంటే మంచిది అలానే శరీరాన్ని యాక్టివ్ గా ఆపిల్స్ మారుస్తాయి కాబట్టి బదులుగా మీరు ఆపిల్స్ ని తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా మీరు టీ కాఫీలకి బదులుగా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది పైగా రిలీఫ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news