సోహైల్‌ ముందు ఫైరింగ్! తర్వాత రిక్వెస్ట్! కాని..

-

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్‌ సొంతంగా  కష్ట పడి పైకి వచ్చిన నటుడుప్రస్తుతం తాను హీరో గా నటించిన సినిమా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. మోక్ష హీరోయిన్ గా దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డైరెక్టర్ ఎ.ఆర్‌.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమా ను నిర్మించారు.ఈ మూవీ  ను డిసెంబర్ 30న రిలీజ్ చేశారు.

ఈ సినిమా ప్రస్తుతం ఓ మాదిరిగా ఆడుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  సోహైల్‌ చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాకు ప్రాబ్లెమ్ అయ్యిందని తెలుస్తోంది. ఆ రోజు ఈవెంట్ లో నెగెటివ్ కామెంట్స్ చేసిన వారిని టార్గెట్ చేస్తూ నా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే వెతికి మరీ తంతా  నా కొడ.. అటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

అసలే నెటిజన్స్ ఏమి అనక పోయినా కామెంట్స్ తో కుళ్ళ బొడిచే రకం, సోహైల్‌ మాటలతో మరింత రెచ్చిపోయి సినిమా పై నెగెటివ్ ప్రచారం చేశారు. తాజాగా ఈ విషయం లో సోహెల్ కొంచం తగ్గి రిక్వెస్ట్ గా. ”సినిమా చూసేవాడి కి వినోదం మాత్రమే కానీ, చేసేవాడికి జీవితం. దయచేసి తీసిపారేయకండి” అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. దీనితో అయినా నెగెటివ్ కామెంట్స్ ఆగిపోతాయేమో వేచి చూడాలి. కాని జరగాల్సిన డామేజ్ ముందే జరిగి పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news