బ్యాక్ పెయిన్ కు నువ్వుల ఉండ.. కంటి చూపుకు లౌకి పాలక్ ముటియా

-

ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సేపు కుర్చోని వర్క్ చేసే వాళ్లకు ఎప్పుడూ వెన్నంటే ఉండి వెన్ను నొప్పి బాధిస్తుంది.. వీరికి ఎక్సర్ సైజ్ చేసే ఓపిక టైమ్ ఉండదు. వెన్ను నొప్పికి ప్రధాన కారణం.. ఎముకల్లో కాల్షియం, ఐరన్ తగ్గడమే.. విటమిన్ డీ లోపిస్తే.. ముఖ్యంగా ఎముకలు నొప్పులు వస్తాయి. ఇది ఎక్కువైతే..తక్కువ ఏజ్ లోనే.. మోకాళ్లు, కీళ్లు నొప్పులు వచ్చేస్తాయి. వర్క్ చేసేప్పుడు ప్రతిగంటకు ఒకసారి లేచి కాసేపు అటుఇటూ తిరిగి మళ్లీ వచ్చి వర్క్ చేసుకునే చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తూ.. ఇప్పుడు చెప్పుకోబోయే.. విటమిన్ డీ లడ్డూనూ డైలీ తింటే సమస్య చాలావరకు మాయం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!

నువ్వుల ఉండ తయారు చేసుకునే విధానం

నువ్వులు పావుకేజీ , ఖర్జూరం అరకేజీ తీసుకోండి. నువ్వులను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఖర్జూరంలో గింజలు తీసేసి.. మిక్సీ వేసుకుని ఆ పేస్ట్ లో దోరగా వేయించుకున్న నువ్వులను కలుపుకుని ఉండలుగా చుట్టుకోండి. మీకు మరీ స్వీట్ వద్దనుకుంటే.. ఈ పేస్ట్ కాస్త తగ్గించుకున్నా పర్వాలేదు. ఇది ఫ్రిడ్జ్ లో పెడితే పాడవకుండా ఉంటుంది. జ్యూసుల్లో వాడుకోవచ్చు. ఈ కొలతలో తీసుకుంటే.. దాదాపు 50 లడ్డూలు వస్తాయి. డైలీ భోజనం చేసిన తర్వాత ఒకటి తినడం అలవాటుగా చేసుకోండి. కొద్దిరోజుల్లోనే.. మీ ఆరోగ్యంలో మార్పులు రావటం గమనిస్తారు. బ్యాక్ పెయిన్ ఉండదు, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా నువ్వులు హెయిర్ కు మాంచిదే.
వంటల్లో రోజు తినేదాని కంటే.. కొత్తరకం వంటలు అయితే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఆ పేరే వెరైటీగా ఉంటే ఏంటా అని పిల్లలు కచ్చితంగా తింటారు. చాలామందికి సొరకాయ అంటే ఇష్టం ఉండదు. అలా అని వదిలేస్తే.. బాడీకీ కావాల్సిన పోషకాలను మిస్ చేసినట్లే కదా.. మరి అలాంటి వారికి సొరకాయ అని తెలియకుండా పెట్టాలంటే.. లౌకి పాలక్ ముటియా చేసి పెట్టాల్సిందే.

లౌకి పాలక్ ముటియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

సొరకాయ తురుము ఒక కప్పు
పాలకూర తురము ఒక కప్పు
మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు
పెరుగు అర కప్పు
పుట్నాల పప్పు పిండి రెండు టేబుల్ స్పూన్లు
వేపించిన నువ్వులు రెండు టేబుల్స్ స్పూన్లు
తేనె రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్స్
మీగడ ఒక టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్
వాము ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా
కారం కొద్దిగా
కరివేపాకు కొద్దిగా

తయారు చేసే విధానం

సొరకాయను తురిమేసి నీరు తీసేసి.. ఆ తురుమును బౌల్ లో వేసుకుని పాలకూర తురుము వేసి మల్టీగ్రెయిన్ పిండి, పుట్నాల పప్పు పొడి, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, వాము, జీలకర్ర పొడి, వేపించిన నువ్వులు, నిమ్మరసం వేసి బాగా కలపండి. ఆ తర్వాత పెరుగు వేసి వాటర్ వాడకుండా కలపండి.. ఉండలుగా చేసుకుని ఆవిరిలో ఉడికించండి. 10-15లో ఉడుకుతాయి. ఆ తర్వాత అవి చల్లారక మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోండి.
పొయ్యిమీద ప్యాన్ పెట్టి మీగడ వేసి.. అందులో కరివేపాకు, నువ్వులు వేసి అందులో కట్ చేసుకున్న ముఠియాలు( ఆవిరి మీద ఉడికించి చేసుకున్నవి) వేసి కారం, నిమ్మరసం, కావాలనుకుంటే తేనె వేయండి. ఐదు నిమిషాలు అలా వేపిన తర్వాత సాఫ్ట్ గా అవుతాయి. చక్కగా తినేయొచ్చు. హెల్తీ అయిన టేస్టీ వంట. బోరింగ్ గా అనుకునే సొరకాయతో ఇలా స్నాక్ చేసుకుంటే.. కంటి చూపుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయ, పాలకూరలో ఉండే పోషకాలు బాడీకి పూర్తిగా అందుతాయి. ఈవినింగ్ టైం తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news