గర్భవతులు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. ప్రాణాలకే ముప్పు..

-

గర్భవతులు ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది..గర్భం ధరించడం మహిళలకు వరం..మరో ప్రాణికి ప్రాణం పొస్తారు.అందుకే వాళ్ళు బిడ్డను కనేవరకు జాగ్రత్తగా ఉండాలని అంటారు.చిన్న పొరపాటు జరిగినా.. కడుపులోని బిడ్డపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ఆ సమయంలో.. శరీరంలో చాలా మార్పులు చోటుచోసుకుంటాయి. హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు, బరువు పెరగడం.. ఇతర భాగాల్లో మార్పులు జరుగుతాయి. అదే సమయంలో మీ శరీరం కూడా మీ నుంచి చాలా డిమాండ్‌ చేస్తుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.

గర్భం దాల్చినప్పుడు నుంచి తొమ్మిది నెలలు బిడ్డను మోయడం ఓపికతో కూడిన పని..గర్భదారణ సమయంలో కొన్ని తప్పులు చెయ్యడం వల్ల బిడ్డా..తల్లికి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది..గర్భవతులు చేసే కొన్ని తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ సమయంలో మహిళలకు ఆకలి లేకపోవడం, వికారం, వామిటింగ్‌ సెన్సేషన్‌ లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీ టేస్ట్‌లు కూడా మారొచ్చు. దాదాపు 6 నుంచి 10 మంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు వారికి ఆహారంపై విరక్తి ఉంటుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే భోజనం మానేయడం.. మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా మొదటి నెలల్లో.. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవాలు ఏర్పడతాయి.అందుకు మీరు పోషకాలు ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.

హార్మోన్ల స్థాయిలు కూడా మారుతూ ఉంటాయి. దీంతో మీరు కొంత బరువు పెరుగుతారు. దీనికి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒత్తిడి, ఆందోళన బిడ్డ ఆరోగ్యం, ఎదుగదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మీరు ప్రశాంతగా ఉంటే బిడ్డకు, మీకు మంచిది. విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బరువు పెరిగామని మీకు అనిపిస్తే.. డెలివరీ తర్వాత మీ బరువును ఈజీగా కంట్రోల్‌ చేసుకోవచ్చు..అంతే కానీ సొంత వైద్యం అస్సలు చెయ్య కూడదు..

కొంతమంది మహిళలకు కొంతసేపు నడవటమూ కష్టంగా అనిపిస్తుంది. చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో పని చేయకూడదు, శరీరానికి శ్రమ ఇవ్వకూడదని నమ్ముతారు. కానీ శారీరక శ్రమ లేకపోయినా.. బిడ్డపై ప్రభావం పడే అవకాశం ఉంది. తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్‌ మీ ఆరోగ్యానికి, మీ బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది..ఎంత యాక్టివ్‌గా ఉంటే బిడ్డకు అంత మంచిది.

తరచుగా వంగి పనిచేయడం మానుకోవాలి. ఇది పిండంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రీ-మెచ్యూర్ డెలివరీ అవకాశాలు పెరుగుతాయి. వీలైనంత వరకు మెట్లకు బదులుగా లిఫ్ట్ ఉపయోగించండి. గర్భిణులు ఎక్కువసేపు నిలబడకూడదు. ఎక్కువసేపు నిలబడటం వల్ల గర్భంపై ఒత్తిడి పెరుగుతుంది. గర్భిణులు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడకూడదు. వీలైనంత వరకు కూర్చొని పని చేయాలి. గర్భధారణ సమయంలో బరువైన మంచం లేదా సోఫాను కదిలించడం వంటి పనులు చేయకూడదు. బకెట్లలో నీరు మోయకూడదు..ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది..తేలిగ్గా ఉంది కదా అని పెద్ద పనులు చెయ్యరాదూ.. ఏదైనా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news