రంజాన్ 2021 : ఈ ఇఫ్తార్ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోండి..!

-

రంజాన్ మాసం అంతా ఉపవాసాలు చేయడం అలానే ఆరాధించడం ఇలా ఎన్నో ఉంటాయి. ఇఫ్తార్ సమయం లో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ స్నాక్స్ ని కనుక మీరు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక్కడ మీ కోసం పలు ఆరోగ్యకరమైన స్నాక్స్. వాటిని ఇప్పుడే చూసేయండి. సులువుగా ప్రిపేర్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

షమ్మీ కబాబ్స్:

షమ్మీ కబాబ్ చాలా పాపులర్. దీనిని మటన్ మరియు చికెన్ తో తయారు చేస్తారు. అదే షమీ కబాబ్స్ ని ఇఫ్తార్ వేళల్లో చికెన్ తో తయారు చేస్తారు. చికెన్ లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి మరియు అవసరమైన అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి. వీటిని ఫ్రై చెయ్యక్కర్లేదు.. మీరు గ్రిల్ చేసుకున్నా పరవాలేదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన పద్ధతి.

దానిమ్మ లేదా పైనాపిల్ రైతా:

ఇది లేకపోతే ఇఫ్తార్ పూర్తయినట్టు కాదు. పుడ్డింగ్ మొదలైన వాటిని స్వీట్స్ గా తయారు చేస్తారు అయితే మీరు దానిమ్మ లేదా పైనాపిల్ రైతాని చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిలో ఎక్కువ ఎలర్జీ, ప్రొటీన్స్ ఉంటాయి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. పైనాపిల్ లేదా దానిమ్మ ని కట్ చేసి యోగర్ట్ మరియు డ్రై ఫ్రూట్స్ వేస్తె చాలు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

సలాడ్స్:

ఇఫ్తార్ వేళలో మీరు సలాడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలానే బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news