ట్రైలర్ టాక్: వకీల్ సాబ్ వచ్చేసాడు..

Join Our Community
follow manalokam on social media

మూడు సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్  తెర మీద చూద్దామని ఎదురుచూస్తున్న అభిమానులకి ఆ అవకాశం మరెంతో దూరంలో లేదని చెబుతూ, అంతకు ముందుగానే ట్రైలర్ రూపంలో ఆ ఆకలిని కొద్దిగా తీరుస్తూ వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ ఆద్యంతం పవన్ కళ్యాణ్ అభిమానులకి కన్నుల విందుగా ఉంది. పవన్ అభిమానులు ఏమి కావాలనుకుంటున్నారో అవన్నీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథలో, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎలా సాయం చేసాడన్నది తెర మీద చూపించేలా ఉన్నారు.

సినిమా మొత్తం కోర్టు డ్రామా అని తెలిసిపోతుంది. కోర్టులో పవన్ కళ్యాణ్ వాదించే తీరు అభిమానులకి జోష్ ఇచ్చేలా ఉంది. చివర్లో పవన్ అడిగిన ప్రశ్న,, ఇచ్చిన పంచ్ హైలైట్ గా నిలుస్తుంది. ముగ్గురు అమ్మాయిల పాత్రలు సినిమాకే హైలైట్ అని అర్థం అవుతుంది. ఇప్పటికే మ్యూజిక్ జనాల్లోకి వెళ్ళిపోయింది. నేపథ్య సంగీతం హైలైట్ గా నిలవనుందని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్లలో సంగీతం అభిమానులకి ఉత్సాహన్నిచ్చేలా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...