వేసవి కాలం అంటేనే మామిడి కాయల సీజన్ అని అందరికి తెలుసు. అయితే మామిడి పండ్లను తినడానికి అందరు ఇష్టపడతారు. లేదా మామిడి జ్యూస్ లు తాగుతారు. కాని పచ్చి మామిడి కాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పచ్చి మామిడి కాయ పచ్చడి చేయటానికి లేదా పప్పులో వేసుకోవడానికి వాడతారు.
మామిడి మన ఆరోగ్యాన్ని చాలా బాగా రక్షిస్తుంది. పచ్చి మామిడి మన శరీరం లో జీవక్రియను వేగవంతం చేసి ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇంకా వాంతులు, వికారం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. మామిడి కాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దానితో పాటు విటమిన్ ఏ, మెగ్నీషియం కూడా ఉంటాయి. పచ్చి మామిడి తినడం వల్ల తక్షణ శక్తిని లభిస్తుంది. మన నోటిలోని పళ్ళు పుచ్చి పోకుండా కాపాడుతుంది. ఇంకా నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
మామిడి కాయలో సోడియం క్లోరైడ్ , ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. మామిడి కాయను పరిశుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి. పచ్చి మామిడి కాయ పై తోలును మెత్తగా నూరి మజ్జిగలో కలిపి రోజుకి 2, 3 సార్లు తాగితే విరోచనాలు, పైల్స్ తగ్గిపోతాయి. పచ్చి మామిడి ముక్కలలో తేనె, మిరియాల పొడి కలిపి తింటే కాలేయము చక్కగా పని చేస్తుంది. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే పచ్చి మామిడి కాయ అతిగా కూడా తినకూడదు. అతిగా తినడం వల్ల గొంతు నొప్పి, అజీర్తి, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. పచ్చి కాయను తిన్న వెంటనే చల్లని నీరు త్రాగరాదు.