ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు. అయితే జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేయకపోవడం వలన కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు..? జీర్ణ వ్యవస్థ బాగుందని ఎలా చెప్పొచ్చు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ బాగుండాలి. జీర్ణ వ్యవస్థ బాగుంటే ఈ మార్పుల్ని చూడొచ్చు. మీరు తీసుకునే ఆహారం నుంచి పోషకాలని సమర్థవంతంగా గ్రహించాలి. అలా చేయడం వలన తక్షణ ఎనర్జీ వస్తుంది. తినగానే శక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగుందని అర్థం చేసుకోవాలి.
జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావు. ఒకవేళ ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉందని తెలుసుకోవడానికి ఇంకో సంకేతం ఆకలి. సరైన సమయంలో ఆకలి వేస్తుంటే జీర్ణవ్యవస్థ బాగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే జీర్ణవ్యవస్థ బాగా పని చేసినప్పుడు చర్మం రంగు కూడా బావుంటుంది జీర్ణశక్తి ద్వారా టాక్సిన్స్ చర్మం ద్వారా రిలీజ్ కాకుండా నిరోధిస్తుంది.
దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పేగులు ఆరోగ్యంగా లేకపోతే మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. అందుకని పేగులు ఆరోగ్యంగా ఉంటే జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉన్నట్లు. బలమైన జీర్ణవ్యవస్థ ఉన్నట్లయితే తరచూ చక్కెర తినాలని కోరిక కలిగి ఉండరు. అలాగే జీర్ణవ్యవస్థ బావుంటే మంచి మూడ్ కూడా ఉంటుంది. మానసిక స్థితి కూడా బాగుంటుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటే ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్స్ రిలీజ్ కాకుండా చూస్తుంది. మూడ్ కూడా బావుంటుంది. జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే మసాలా, జంక్ ఫుడ్ వంటి వాటిని తగ్గించాలి. కూరలు, పండ్లు తీసుకుంటూ ఉండాలి రోజు కాసేపు వ్యాయామం చేస్తే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.