ఈమధ్య నిద్ర పుచ్చడానికి ఆన్ లైన్ లో రకరకాల యాప్స్ వచ్చేసాయి. ప్రస్తుతం వాటి సంగతి పక్కన పెడితే, మీకు ఒళ్ళు తెలియకుండా నిద్ర రావాలంటే డైరీ రాసే అలవాటు ఉండాలి.
అవును.. డైలీ డైరీ రాసే అలవాటు ఉన్నవారికి నిద్ర బాగా పడుతుందట. ఈ విషయాన్ని నిపుణులు నొక్కి వక్కానిస్తున్నారు.
డైరీ రాయడానికి నిద్ర బాగా పట్టడానికి సంబంధం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతిరోజు ఫలానా టైం కి డైరీ రాసే అలవాటును పెట్టుకున్నట్లయితే.. ఆ టైం కి నిద్రపోవాలన్న ఆలోచన మన శరీరానికి వచ్చి క్రమంగా అది అలవాటుగా మారుతుంది.
జనరల్ గా ఏదైనా రాస్తున్నప్పుడు మనసులో ఊగిసలాటలు తక్కువగా ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ దాదాపు తగ్గిపోతాయి. ఆ కారణంగా సుఖమైన నిద్ర పడుతుంది.
డైరీ రాస్తున్నప్పుడు ఆరోజు జరిగిన సంఘటనలను ఒకసారి నెమరు వేసుకుంటాను. వాటివల్ల ఏం నేర్చుకున్నామనేది ఆలోచిస్తారు. తద్వారా అనవసరమైన విషయాలని ఫిల్టర్ చేసే అవకాశం ఉంది.
దానివల్ల ఏది మంచో ఏదో చెడో ఆలోచించే సమయం దొరుకుతుంది. అనవసరమైన విషయాలను పక్కన పెట్టేయగలుగుతారు.
అయితే డైరీ రాసేవాళ్ళు డైరీని ఎక్కువగా నెగటివ్ థాట్స్ తో నింపి వేయకూడదు. దానివల్ల నిద్ర దూరమయ్యే అవకాశం ఎక్కువ. అది కాకుండా ఆ డైరీ ని ఎప్పుడన్నా చదివినప్పుడు నెగిటివ్ థాట్ మైండ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది.
ఒక రోజులో జరిగిన మనసుకు హాయిని ఇచ్చే సంఘటనలను మాత్రమే డైరీలో రాస్తే బాగుంటుంది.
సుఖమైన నిద్ర కావాలనుకుంటే మనసుని డైరీ ని పాజిటివ్ థాట్స్ తో నింపుకోవడం కన్నా ఉత్తమం మరొకటి లేదు.