నిద్రపోయేటప్పుడు ఎడమ వైపు కి పడుకుంటున్నారా…? అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడే తెలుసుకోండి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన గురక తగ్గుతుంది. అలానే గర్బిణీ స్త్రీలు ఎడమ వైపు తిరిగి పడుకోవడం చాలా మంచిది. దీని వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలానే గర్బాశయంకు, కడుపు లోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది. అలానే ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే వీపు, వెన్నునొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కాలేయం మరియు మూత్ర పిండాలు బాగా పని చేస్తాయి.
అంతే కాదండి భోజనం తర్వాత జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. వీపు, మెడ నొప్పులున్న వారికి ఉపశమనం కలుగుతుంది. గుండె లోని మంటను తగ్గించడం తో పాటు గుండెకు శ్రమ తగ్గి చక్కగా పని చేస్తుంది. అల్జీమర్ ను కూడా తగ్గిస్తుంది. రాత్రి ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా ఉంటుంది. ఎడమ వైపు నిద్రపోతే మెదడు చురుకుగా పని చేస్తుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో…! ఒక్క సారిగా ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం కష్టం. కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మంచిది. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుండే ఈ అలవాటు చేయడం వలన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.
రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోకూడదు. రెండు గంటలు గడచిన తర్వాత నిద్రపోవడం మంచిది. ఒక వేళ వెంటనే నిద్ర పోయారంటే షుగరు , గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. కనుక ఈ పద్ధతిని అనుసరిస్తే మేలు కలుగుతుంది.