మరో కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో కేంద్రం

-

మీ దగ్గర 15ఇయర్స్‌ ఓల్డ్‌ కార్లు, బైకులు ఉన్నాయా..! అత్తగారు పెట్టిన బైక్‌… మొదటి జీతంతో కొన్నకారు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్‌ వంటి సెంటిమెంట్లతో ఇప్పటికీ వాడుతున్నారా..? అయితే వాటిని ఇంటికి పరిమితం చేయాల్సిందే. రొడ్డెక్కిచ్చారో అంతే సంగతులు. చెత్తకింద పడేయటమో.. పాత ఇనుప సామానుకో అమ్ముకోవాల్సిందే. లేదా… ఇంట్లో గుర్తుగా పెట్టుకోవాల్సిందే. ఎందుకు అనుకుంటున్నారా..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కేంద్రం మరో కొత్త చట్టం తెస్తుందా అన్న సంశయానికి బీజం వేశాయి.

బైక్‌… కారు.. ఒక్కసారి కొన్నారంటే ఏళ్ల తరబడి వాడుతున్న వాళ్లుంటారు. న్యూ మోడల్‌ వెహికిల్స్ కొంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యేవాళ్లు చాలా తక్కువ. అందులోనూ… అత్తగారు పెట్టిన బైక్‌.. కష్టపడి సంపాధించిన డబ్బుతో కొన్న కారు.. అమ్మనాన్నలు గిఫ్ట్‌గా ఇచ్చిన వెహికిల్స్‌ను ఎన్నేళ్లయినా జాగ్రత్తగా కాపాడుకుంటూ రిపేర్లు చేయించుకుంటూ వాడుతుంటారు కొందరు.

ఇక పై వెహికిల్స్‌ లైఫ్‌ టైం 15 ఏళ్లే. 15 ఇయర్స్‌ ఓల్డ్‌ వెహికిల్‌ మీరు వాడుతున్నారా.. ఐతే వాటిని ఇంటికి పరిమితం చేయాల్సిందే అంటోంది కేంద్రం. రోడ్డెక్కిస్తే చర్యలు తప్పవని.. అలాంటి చట్టాన్ని తీసుకురాబోతోందని సమాచారం. ఆ చట్టం ప్రకారం 15 ఏళ్ల పైబడిన కార్లు, బైక్‌లు మొత్తం చెత్త కింద పడేయాల్సిందే.15 ఏళ్ల కంటే పాతవైన వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోందని.. దీంతోపాటు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా రకరకాలైన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు కేందమంత్రి నితిన్‌ గడ్కారి. ఇటీవల ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ మార్కెట్లోకి పెద్ద ఎత్తున వస్తుండటంతో.. కొత్తవాటికి రూట్ క్లియర్ చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోందని సమాచారం.

ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఈ చట్టంపై చర్చకు దారితీసింది. కరోనా వల్ల అన్ని రంగాలు నష్టపోయినట్టే.. ఆటోమొబైల్ రంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ మీద ఆటో రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్ కోసం తాము చేస్తున్న కృషికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రావాలని కోరుకుంటోంది. ఆటోమొబైల్ రంగానికి కొత్త ఉత్సాహం ఇచ్చేందుకు బహుశా బడ్జెట్‌లో దీనిపై కేంద్రం ప్రతిపాదన చేసే అవకాశం ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రతిపాదనలో ఉంది. దీనికి ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంది.

పాత వాహనాలను స్క్రాబ్‌ కింద అమ్మితే… వాటిని ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలు చేసి.. ఆ ముడిసరుకు ద్వారా కొత్త వాహనాలు తయారు చేసేందుకు వీలవుతుందని, దాని వల్ల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news