వైఎస్ జగన్ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు.. సాక్షిలో ప్రకటన ఇవ్వడానికి కూడా ప్లేస్ ఇవ్వలేదని ఆగ్రహించారు. విజయమ్మ కూడా మాట్లాడారు…డబ్బులు ఇస్తామన్నా సాక్షిలో ప్రకటనకు ప్లేస్ ఇవ్వలేదని బ్రదర్ అనిల్ బాంబు పేల్చారు.

తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు.. నాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. నా ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయని జగన్ అన్నారని బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టాలని షర్మిలను ప్రశాంత్ కిషోర్ కోరాడు అని వెల్లడించారు బ్రదర్ అనిల్. గెలిచిన తర్వాత జగన్ మమ్మల్ని పక్కన పెట్టాడు.. పవర్ వచ్చాక జగన్ నిజ స్వరూపం బయటపడిందని చెప్పారు బ్రదర్ అనిల్. కాంగ్రెస్ లో ఉంటే జగన్ సీఎం అయ్యేవారు అన్నారు బ్రదర్ అనిల్.