ఏసీలో ఎక్కువ సేపు ఉండేవాళ్ల చర్మం పొడిబారిపోతుంది. అంతే కాదు.. చాలాసేపు ఏసీలో కూర్చొని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లారంటే అంతే.. ఆ సమస్య ఇంకాస్త పెరుగుతుంది.
అబ్బబ్బ.. ఏం ఎండలురా దేవుడా. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండ బారి నుంచి ఎలా తప్పించుకోవాలి.. అని హ్యాపీగా ఏసీలు వేసుకొని కూర్చుంటున్నారా? అయితే మీరు సమస్యల్లో ఇరుక్కున్నట్టే. ఎందుకంటే.. ఎండ వేడి కన్నా ఏసీయే డేంజర్ అట. ఏసీలో ఎక్కువ సేపు గడపటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో తెలుసుకుందాం పదండి..
ఏసీలో ఎక్కువ సేపు ఉండేవాళ్ల చర్మం పొడిబారిపోతుంది. అంతే కాదు.. చాలాసేపు ఏసీలో కూర్చొని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లారంటే అంతే.. ఆ సమస్య ఇంకాస్త పెరుగుతుంది. పొడి చర్మం ఉండేవాళ్లకైతే ఆ సమస్య ఇంకాస్త పెరుగుతుంది.
కళ్లు పొడిబారిపోయి ఉండేవాళ్లు కూడా ఏసీలో ఎక్కువ సేపు ఉండకూడదు. ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల కంట్లో ద్రవాలు తగ్గిపోతాయి. దీంతో కళ్లు పొడిబారుతాయి. అంతే.. కళ్లు పొడిబారే సమస్య ఉన్నవాళ్లు అసలు ఏసీలోనే ఉండకూడదన్నమాట.
ఇంకా.. ఏసీ గదుల్లో తక్కువగా ఉండే తేమ శాతం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అంతే కాదు.. విపరీతంగా దాహం వేస్తుంది.
ఏసీల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల ముక్కు, గొంతు, కళ్లు, శ్వాస కోశ సంబంధ వ్యాధులు వస్తాయి. అంతే కాదు.. ముక్కు రంద్రాలు మూసుకుపోవడం.. దాని వల్ల ముక్కు లోపల ఉండే సున్నితమైన పొర వాయడం జరుగుతుంది. దాని వల్ల ఇన్ ఫెక్షన్ అయి ముక్కు వాసి లేని పోని సమస్యలు వస్తాయి.
కొందరికి ఏసీ అంటే పడదు. అయినప్పటికీ… ఎండ వేడిని తట్టుకోలేక ఏసీ గదుల్లో గడిపితే… తలనొప్పి వస్తుంది. అది మైగ్రేన్ కు కూడా దారి తీస్తుంది.