ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ (ఆందోళ‌న) ఉందా ? వీటిని తీసుకోవ‌డం మానేయండి..!

-

ప్ర‌స్తుతం పౌరుల జీవనం పూర్తిగా యాంత్రికం అయింది. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు జ‌నాలు యంత్రాల్లా ప‌నిచేస్తున్నారు. అయితే నిత్య జీవితంలో అనేక మంది అనేక స‌మ‌యాల్లో తీవ్ర‌మైన ఒత్తిడిని, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ కూడా ఒక‌టి. దీని వ‌ల్ల కొంద‌రు ప్ర‌తి విష‌యానికి భ‌య‌ప‌డుతుంటారు. కంగారు, ఆందోళ‌న ఉంటాయి. చిన్న విష‌యాల‌కే తీవ్రంగా భ‌యానికి లోన‌వుతుంటారు. ఇలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేస్తే దాని వ‌ల్ల కొంత వ‌ర‌కు ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

stop taking these foods to get rid of anxiety disorder

* నిత్య జీవితంలో చాలా మంది టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. ఒత్తిడిని త‌ట్టుకునేందుకు, మ‌నస్సు రిలాక్స్ అవుతుంద‌ని, నిద్ర రాకుండా మేల్కొని ఉండ‌వ‌చ్చ‌ని అనేక మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అయితే వాటిని తాగ‌డం వ‌ల్ల ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ స‌మ‌స్య కూడా పెరుగుతుంది. క‌నుక వాటిని తాగ‌డం పూర్తిగా మానేయాలి. లేదా ప‌రిమిత‌మైన మోతాదులో తాగాలి. దీని వ‌ల్ల ఆంగ్జ‌యిటీ డిజార్డ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాల్లో అత్య‌ధిక స్థాయిలో చ‌క్కెర‌లు, రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి ఆంగ్జ‌యిటీకి కార‌ణ‌మ‌వుతాయి. క‌నుక ఇలాంటి ఆహారాల‌ను పూర్తిగా మానేస్తే మంచిది.

* మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. దీంతో శరీరంలోని న్యూరో ట్రాన్స్‌మిట‌ర్ ల‌య త‌ప్పుతాయి. ఫ‌లితంగా శ‌రీరంలో ఆంగ్జ‌యిటీ మొద‌ల‌వుతుంది. క‌నుక ఆల్క‌హాల్‌ను మానేస్తే మంచిది.

* బాగా వేయించిన ప‌దార్థాలు జీర్ణ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయి. ఇవి ఆంగ్జ‌యిటీని క‌లిగిస్తాయి. క‌నుక వేయించిన ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి.

* ఫ్రూట్ జ్యూస్‌ల‌లో అత్య‌ధిక మోతాదులో చ‌క్కెర‌లు ఉంటాయి. ఇవి శ‌రీరానికి ఏమాత్రం మంచివి కావు. వీటిని మానేస్తే ఆంగ్జ‌యిటీ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇక ఆంగ్జ‌యిటీని త‌గ్గించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం, స‌రైన పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను స‌మ‌యానికి తీసుకోవ‌డం, అరోమా థెర‌పీ, శ్వాస వ్యాయామం చేయ‌డం.. వంటివి పాటించాలి. దీంతో ఆంగ్జ‌యిటీ మాత్ర‌మే కాదు, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ముఖ్యంగా ఒత్తిడిని త‌గ్గించుకుని మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news