ప్రెగ్నెన్సీ ముందస్తు ల‌క్ష‌ణాలు ఇవే….!

మ‌హిళ‌లు ఎవ‌రైనా స‌రే.. గ‌ర్భం ధరించిన కొన్ని రోజుల త‌రువాతే మూత్ర లేదా ర‌క్త ప‌రీక్ష‌లో ఆ విషయం తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు గ‌ర్భం ధరించామా.. లేదా.. అన్న సంగ‌తి ఎవ‌రికీ తెలియ‌దు. అయితే గ‌ర్భం ధ‌రించిన ఆరంభంలోనే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించ‌డం ద్వారా మ‌హిళ‌లు గ‌ర్బం దాల్చార‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి మ‌హిళ‌లు గ‌ర్బం ధరించార‌ని చెప్ప‌డానికి వారిలో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల‌కు నెలస‌రి రాదు. నెల‌స‌రి రాక‌పోతే అది పీరియ‌డ్స్ స‌మ‌స్య అయినా అయి ఉండాలి లేదా గ‌ర్భం ధరించ‌డం అయినా అయి ఉండాలి అని అర్థం చేసుకోవాలి.

2. గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల‌కు ఛాతిలో నొప్పి వ‌స్తుంటుంది. వారిలో విడుద‌ల‌య్యే హార్మోన్ల వ‌ల్లే అలా జ‌రుగుతుంది. గ‌ర్భం ధరించార‌ని చెప్ప‌డానికి ఇది కూడా ఒక నిద‌ర్శ‌నం.

3. గ‌ర్భం ధరించాక 4, 8 వారాల్లో మ‌హిళ‌ల‌కు వికారం, వాంతులు వ‌స్తుంటాయి. హ్యూమ‌న్ కొరియోనిక్ గొనాడో ట్రోఫిన్ అనే హార్మోన్ వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. అయితే కొన్ని రోజుల‌కు వాటంత‌ట అవే వాంతులు ఆగిపోతాయి.

4. గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల్లో హార్మోన్ల‌లో వేగంగా మార్పులు వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వారికి చిరాకు, కోపం వస్తుంటాయి.

5. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లో పెరుగుల, త‌గ్గుద‌ల వేగంగా అవుతున్నా మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించార‌ని తెలుసుకోవాలి.