ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుండాలంటే వీటిని తీసుకోండి..!

ఈ మధ్య కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో అనర్రోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. గాలి యొక్క నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి శ్వాస తీసుకోవడంలో కొంత కష్టం కూడా ఉంటుంది.

 

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కాలుష్యం పెరిగి పోవడం వల్ల రెస్పిరేటరీ సమస్యలు వస్తాయి. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి…?, ఏ విధంగా అనుసరించడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి అని దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం కూడా పూర్తిగా చూసేయండి.

ఆపిల్:

స్టడీ ప్రకారం చూసుకున్నట్లయితే ఆపిల్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం బాగుంటుంది. ఊపిరితిత్తుల యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఆస్తమా, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

బెల్లం:

బెల్లం తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యం బాగుంటుంది. శ్వాస సులువుగా తీసుకోవడానికి బెల్లం మనకు సహాయం చేస్తుంది. అలానే ఊపిరితిత్తులు లోపల గాలిని కూడా ఇది పెంచుతుంది.

వాల్ నట్స్:

ఇందులో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రెస్పిరేటరీ సమస్యల నుండి బయటపడవచ్చు.

బీట్రూట్:

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇది కూడా చాలా మంచిది. ఆక్సిజన్ ను ఎక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. బీట్ రూట్ లో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి మరియు ఇతర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రిస్క్ మరియు ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అలాగే ఆస్తమా మరియు ఇతర అనారోగ్య సమస్యల నుండి కూడా ఇది బయట పడేస్తుంది.

పసుపు:

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పసుపు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ మరియు అనారోగ్య సమస్యల బారిన పడకుండా పసుపు మనకు సహాయం చేస్తుంది. ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని కూడా పసుపు పెంచుతుంది. ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.