చామ దుంపలతో కూర, ఫ్రై ఇలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. కానీ చాలా మందికి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియవు. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా….? అయితే ఒక లుక్ వేసేయండి. చామ దుంపలు రుచికి మాత్రమే కాదు. హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తాయి. వీటిలో న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉంటాయి. చేమ దుంపలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కనుక మధుమేహం రిస్క్ ని తగ్గిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు చామ దుంపలని తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్ ని మెరుగు చేస్తుంది. దీని మూలంగా శరీరం లో ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది.
అలానే బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. చేమదుంపల కోపం తో పాటు ఐరన్ కూడా లభిస్తుంది. బ్లడ్ బిల్డింగ్ కి ఇవి తోడ్పడతాయి. ఎనిమియా సమస్య తో బాధ పడే వాళ్ళకి చామదుంప బాగా సహాయం చేస్తుంది. పైగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చామ దుంపలు తీసుకోవడం వల్ల ప్రాపర్ గా అరుగుదల అవుతుంది. చామ దుంపను మీ డైట్ లో చేర్చితే అరుగుదలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యానికి కూడా చామదుంప చాలా మంచిది. దీని లోని పొటాషియం అధికంగా లభిస్తుంది.
దీనితో సెల్ ఫంక్షన్స్ నార్మల్ గా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్యాన్సర్ తో ఇబ్బంది పడేవాళ్ళు లేదా క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళు చామ దుంపను తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాగా సహాయం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పర్చడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. చూశారా చామదుంప వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో…! మరి మీ డైట్ లో చేర్చండి ఆరోగ్యంగా ఉండండి.