మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు మీకోసమే.

-

మూత్ర పిండాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే వాటి ఆరోగ్యానికి అవసరమయ్యే ఆహారాలు ఏంటనేది చాలా మందికి తెలియదు. కానీ మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కిడ్నీలు దెబ్బతినడానికి ముఖ్య కారణం సోడియంని ఎక్కువగా తీసుకోవడమే. ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే గనక మూత్రపిండాలు దెబ్బతింటాయి. అలాగే ఫాస్పరస్ ని ఎక్కువగా తీసుకోకూడదు. ఫాస్పరస్ కలిగిన ఆహారాలకి దూరంగా ఉంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్

రోజుకీ ఆపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుందని చెబుతారు. ఆపిల్ లో ఉండే పెక్టిన్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బెర్రీ

బెర్రీలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంటే వీటిల్లో చెడు పదార్థాలతో పోరాడే శక్తి ఉంటుంది. కాబట్టి మూత్రపిండాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ ఏదైనా సరే మూత్రపిండాలకి నష్టాన్ని కలిగించవు.

సిట్రస్ ఫలాలు

విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ ఫలాలని ఆహారంగా తీసుకుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. నిమ్మ, నారింజ, బత్తాయి మొదలగు వాటిని ఆహారంగా తీసుకుంటే మంచిది. అలాగే రోజూ పొద్దున్న లేవగానే, నిమ్మరసం కలిపిన నీళ్ళూ తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే సమస్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

క్యాబేజీ

క్యాబేజీలో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల మూత్రపిండాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

స్వీట్ పొటాటో

రోజులో ఏ సమయంలోనైనా ఆహారంగా తీసుకోగలిగే అద్భుతమైన ఖనిజ లవణాలు కలిగిన స్వీట్ పొటాటోలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version