ఆడవారితో పోలిస్తే మగవారు చేసే తప్పులు ఇవేనట.. అందుకే వాళ్లకు లైఫ్ రిస్క్ ఎక్కువ.!

-

ఆడవారితో పొలిస్తే ఆరోగ్యకరమైన తప్పుల్లో మగవారు చేసేవి ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు కొన్ని మానాల్సినవి, వాటి స్థానంలో కొత్తగా నేర్చుకోవాల్సినవి ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాధారణంగా మగవాళ్లు అందరూ చేసే తప్పులు ఏంటంటే..

ఆల్కాహాల్, సిగిరెట్లు, గుట్కాలు, జరదాలు, కిల్లీలు, ఆడవారికి ఈ అలవాట్లు చాలా తక్కువ శాతం మందిలో ఉంటాయి. కానీ 90 శాతం మగవారిలో వీటిలో ఏదైన ఒక్క అలవాటైన కచ్చితంగా ఉంటుంది.

ఆడవారితో పోలిస్తే మగవారు ఎక్కువ తిండి తింటారు. దీనివల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది.

మగవారు సంతోషంగా ఉండేది చాలా తక్కువ. పాపం వీరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆడవారికి ఇంత ఉండదు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది.

పొల్యూషన్ ఎఫెక్టు కూడా మగవారికి ఎక్కువగా ఉంటుంది. బయట తిరిగేప్పుడు కూడా ఆడవాళ్లు కవర్ చేసుకున్నంత మగవాళ్లు స్కిన్ ని కవర్ చేసుకోరు.

ఇవన్నీ మగవారి ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయి.

అసలు ఈ అలవాటు వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయాంటే:

ఆల్కాహాల్ తాగటం అనేది.. సరదాగా మొదలేస్తారు. ఆడవారికి ఉండే సర్కిల్ తో పోలిస్తే.. మగవారికి ఎక్కువగా ఉంటుంది. దీని వల్లే సగం చెడిపోతారు. ఆల్కాహాల్, డ్రగ్స్ వల్ల మత్తు వస్తుంది. పైగా అందరూ నైట్ తాగుతారు. అలా తాగి పడుకున్నప్పుడు బాడీ అంతా కూడా మత్తులో ఉండి..లివర్ కానీ, సెల్ మెకానిజం కానీ డీటాక్సిఫికేషన్ చేసుకోదు. ఇవి మానేసి..జ్యూస్ లు పండ్లు పెట్టండి లివర్ జీవితకాలం పనిచేస్తుంది

ఇంకోటి సిగిరెట్స్..ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బందిపెట్టే ఫస్ట్ కాన్సర్ లంగ్ క్యాన్సర్. దానికి కారణం కేవలం సిగిరెట్లు. ఇతర దేశాల్లో ఆడవారు కూడా తాగుతారు కానీ..మన దేశంలో 90శాతం ఆడవారు దీని జోలికి వెళ్లరు. దీనివల్ల బాడీలోకి కార్సినోజనిక్ మెటీరియల్స్ ఎక్కువగా వెళ్తాయి. దానివల్ల రకరకాల క్యాన్సర్ వస్తాయి. వీటితోపాటు గుట్కాలు, కిల్లీలు వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది.

ఉన్న కెమికల్ పొల్యూషన్ చానట్లు..ఇలాంటివి అలవాటు చేసుకుని తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. రోగాలు వచ్చి ఆసుపత్రికి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతాయి.

అసలు మగవారు ఆడవారి కంటే ఎక్కువ తినడానికి కారణం ఏంటి:

అభిరుచుల్లో ఆడవారికి మగవారికి చాలా తేడా ఉంటుంది. ఆడవారు ఏది తిన్నా సరే అది కొంచెం అయినా టేస్టీగా ఉండేదే తినాలనుకుంటారు. కొంచెం ఉప్పు నూనెలు తక్కువైతే అడ్జస్ట్ అవలేరు. అసలు టేస్ట్ లేకపోతే యాక్సప్ట్ చేయలేరు. మగవారు అలకాదు..అది ఎలా ఉన్నా సరే ట్యాంక్ నింపుతారు. బయట ఎక్కువగా తింటారు. అలా ఎక్కువ తింటారు. ఒబిసిటీ కూడా మగవారిలో ఎక్కువగా ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ కూడా మగవారిలోనే ఎక్కువ ఉంటుంది. ఆడవారితో పోలిస్తే..చాలా జబ్బులు మగవారికే వస్తాయి. లైఫ్ రిస్క్ మగవారిలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇకనుంచి అయినా మారితే వారితోపాటు వారి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే

అయితే స్ట్రెస్ విషయానికి వస్తే..ఆడవారికి మగవరాకి ఒకేలా ఉండదు. ఇద్దరూ పనిచేస్తున్నారు కాబట్టి ఒత్తిడి ఇద్దరికి ఉంటుంది. కానీ ఆడవారికి నవ్వడం, సంతోషంగా ఉండటం, నలుగురితో పంచుకోవడం బాగా అలవాటు. కానీ మగవారు ఇలాంటివి ఏవి చేయరు. సైంటిఫిక్ స్టడీ ప్రకారం..ఆడవారు రోజులు సుమారుగా 40-50 సార్లు నవ్వితే మగవారు 10-15 సార్లే నవ్వుతారట. దీనివల్ల ఆడవారిలో హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. స్ట్రస్ ను చాలా తగ్గిస్తాయి. కానీ మగవారికి సీరియస్ గా ఉండటం, గంభీరంగా ఉండటం వల్ల స్ట్రస్ ఎక్కువగా ఫీల్ అవుతారు. దీని ద్వారా మానసిక సమస్యలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news