పాలల్లో కంటే వీటిలోనే క్యాల్షియం ఎక్కువ..!

-

ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతో ముఖ్యం క్యాల్షియం లేకపోతే అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి చాలామంది కాల్షియం లోపంతో బాధపడుతూ ఉంటారు. అయితే కాలుష్యం లోపం కలగకుండా క్యాల్షియంని పొందాలంటే పాలు మాత్రమే కాదు పాలకంటే ఎక్కువ క్యాల్షియం ఈ ఆహార పదార్థాల ద్వారా తీసుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే కాల్షియం అందుతుంది కాల్షియం లోపంతో బాధపడే వాళ్ళకి దివ్య ఔషధంలా ఈ ఆహార పదార్థాలు పనిచేస్తాయి.

- Advertisement -

calcium

నిజానికి పాలని తీసుకుంటే కాల్షియం బాగా అందుతుందని ఇతర పోషకాలు కూడా పాలల్లో ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. పైగా ఎముకలు కూడా పాలని తీసుకుంటే దృఢంగా ఉంటాయి. అయితే పాలు ధర ఎక్కువ పైగా క్యాల్షియం కూడా కొన్ని ఆహార పదార్థాలతో పోల్చి చూసుకున్నట్లయితే తక్కువగా ఉంటుంది. మరి పాల కంటే ఎక్కువ కాల్షియం వేటిలో ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

పాలకంటే ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుంది పొన్నగంటి కూరలు అయితే ఏకంగా 510 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గోంగూర లో కూడా క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. మెంతికూరలో, తోటకూరలో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎండు కొబ్బరిలో కూడా క్యాల్షియం బాగా అధికంగా ఉంటుంది. సోయాబీన్స్ ని తీసుకుంటే కూడా క్యాల్షియం బాగా అందుతుంది.

గోరుచిక్కుడు లో కూడా క్యాల్షియం బాగా ఉంటుంది అదేవిధంగా శనగల్లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులో కూడా క్యాల్షియం ఎక్కువ ఉంటుంది ఉలవల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ ఆహార పదార్థాల ద్వారా మనం ఎక్కువ కాల్షియంని పొందొచ్చు కేవలం పాలు మాత్రమే కాదు ఈ ఆహార పదార్థాలు కూడా మనకి క్యాల్షియం బాగా ఇస్తాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ ఆహార పదార్థాలను కూడా మీరు మీ డైట్ లో చేర్చుకుని క్యాల్షియం లోపం నుండి బయటకి వచ్చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...