టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్.. వేట షురూ..!

-

మాస్ మహారాజా రవితేజ హీరోగా రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేర్గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ  పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఈ సినిమా తెరకెక్కుస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్, ఫస్ట్ లుక్ అదిరిపోయాయి. తాజాగా పవర్ ఫుల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఏపీలోని గోదావరి గట్టున పుట్టిన టైగర్ నాగేశ్వరరావు గజదొంగగా దేశాన్ని ఎలా గడగడలాడించాడు.. ఒక చిన్న టీజర్ తో మేకర్స్ చెప్పేశారు. బాలీవుడ్ హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా కీలక పాత్రలో నటించారు. చాలా గ్యాప్ తరువాత రేణుదేశాయ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news