ప్రెగ్నెంట్ అయ్యిన వెంటనే వీటిని తప్పక ఫాలో అవ్వండి..!

-

ప్రెగ్నెంట్ అవ్వడం బిడ్డకు జన్మనివ్వడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత రెండు లైన్లు కనుక ఉండి కన్ఫర్మ్ అని తెలిస్తే వెంటనే ఈ పనులు చేయండి.

 

pregnant women

ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పండి:

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని మీ భాగస్వామికి మరియు మీ కుటుంబ సభ్యులకి తెలియజేయండి. దీనితో మీరు ఆనందంగా ఉండొచ్చు.

డాక్టర్ని కన్సల్ట్ చేయండి:

ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకున్న తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ ని కన్సల్ట్ చేయండి దీంతో మీకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి అనేది కూడా తెలుస్తుంది.

ప్రినేటల్ విటమిన్స్:

కావాల్సిన సప్లిమెంట్స్ మరియు విటమిన్స్ ని కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రినేటల్ విటమిన్స్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది.

ఆల్కహాల్ వద్దు:

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆల్కహాల్, కెఫిన్ కి దూరంగా ఉండటం మంచిది ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు వీలైనంతవరకు మానేయడం మంచిది. కెఫీన్ విషయానికి వస్తే రోజుకి 200 మిల్లీ గ్రాముల వరకు పర్వాలేదు. అంతకు మించి తీసుకోవద్దు.

పోషకాహారం తీసుకోండి:

పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి ప్రతి రోజు కూడా మీరు మీ డైట్ లో మంచి ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news