పాలల్లో బాదం పొడి వేసుకొని తీసుకుంటే ఈ సమస్యలు రావు..!

-

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అదే పాలల్లో బాదం (Badam) పొడి వేసుకుని తాగితే ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తొలగించుకోవచ్చు.

 

బాదం | Badam

 

పాలలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది మరియు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ప్రతి రోజు నిద్ర పోయే ముందు పాలలో కాస్త బాదం పొడి వేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు అనేది ఇప్పుడు చూద్దాం ..

బాదం అజీర్తిని పోగొడుతుంది:

బాదం పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. పాలల్లో బాదం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. బాదం లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్, గ్యాస్ సమస్యలు కూడా ఉండవు.

ఒత్తిడిని దూరం చేస్తుంది:

ఆయుర్వేదం ప్రకారం పాలు తాగడం వల్ల రీప్రొడక్టివ్ టిష్యూస్ కి ఎనర్జీ వస్తుంది అదే విధంగా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి ఇలా తాగడం వల్ల అధికంగా తినకుండా అది చూసుకుంటుంది.

మంచి నిద్ర పొందొచ్చు:

బాదం పొడిని పాలల్లో వేసుకుని తీసుకోవడం వల్ల మంచి నిద్ర ఉంటుంది ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు మరియు నిద్ర కూడా బాగా పడుతుంది. అలానే మంచి ఎనర్జీ కూడా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news