టీ తాగేటప్పుడు వీటికి దూరంగా ఉండాల్సిందే …!

ఎక్కువ మంది ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా మధ్యాహ్నం ఒక కప్పు టీ తాగుతుంటారు.
కానీ ఎదో ఒక సమయంలో చాలు కంపల్సరీగా టీ పడాల్సిందే. కానీ టీ తాగే అలవాటు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది ఇలా ఉంటె టీని తాగేటప్పుడు, అదే సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి ఆ పొరపాట్ల గురించి ఇప్పుడే తెలుసుకుని మీరు చెయ్యండి. వివరాల్లోకి వెళితే…

మధ్యాహ్నం పూట సరదాగా టీ తాగుతూ శెనగపిండితో చేసిన బజ్జీలు, పకోడీలు తినేస్తూ ఉంటారు. కానీ ఇది మంచి హ్యాబిట్ కాదు. ఎప్పుడు కూడా శెనగపిండితో చేసిన వంటకాలను టీ తో కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వాళ్ళ ఎం అవుతుందంటే…? పోషకాలు క్షీణించి, ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీటిని టీ తో తీసుకునేవారు ఆ అలవాటుని కట్ చేస్తే మంచిది. అలానే ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ తిన్న వెంటనే ఒక కప్పు టీ తాగుతుంటారు. అలా చేయడం కారణంగా జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఇది ఇలా ఉండగా టీ తో పాటు డ్రైఫ్రూట్స్ లేదా టీ తాగిన వెంటనే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మాత్రం అది విషంగా మారి కడుపు నొప్పి, మోషన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి టీ తాగేటప్పుడు కానీ తాగిన వెంటనే కానీ వీటిని తీసుకోకండి. వీటిని కనుక తింటే కాస్త గ్యాప్ ఇవ్వడం మంచిది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు.