ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండడానికి చూసుకోవాలి. చాలామంది ఈరోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె సమస్యలు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా వారం రోజుల ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి. వీటిని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. గుండెపోటు వచ్చే వారం రోజులు ముందు చాతిలో కాస్త నొప్పి వస్తుంది. సాధారణంగా ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. గుండెపోటు సమయంలో వచ్చే ఛాతి నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఎక్కువగా ఇది ఎడమవైపు వస్తుంది.
అలాగే గుండెపోటు వచ్చే ముందు భుజం, చేతుల్లో నొప్పులు కనబడతాయి. ఎడమ భుజం లో తీవ్రమైన నొప్పి వచ్చింది అంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించి టెస్ట్ చేయించుకోవడం మంచిది. అలాగే కొన్ని సందర్భాల్లో అరచేతితో పాటుగా చేతుల్లోనూ నొప్పి వస్తుంది. భరించలేని నొప్పి వారం రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.
గుండెపోటు కి వెన్ను నొప్పికి సంబంధం ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకపోయినా వెన్నునొప్పి వస్తున్నట్లయితే వైద్యుల్ని సంప్రదించాలి. గుండెపోటు వచ్చే ముందు దవడలో నొప్పి వస్తుంది ఎడమవైపు దవడలో సడన్ గా నొప్పి వచ్చింది అంటే డాక్టర్ల సలహా తీసుకోవడమే మంచిది. గుండెపోటు వచ్చే ముందు ఈ లక్షణాలు కనబడతాయని గుర్తుపెట్టుకుని ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ ని సంప్రదించండి. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవడం ముఖ్యం.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.