ఈ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతం.. ఎలా గుర్తించాలంటే..

-

పెద్దప్రేగు..పేరుకు తగ్గట్లే పెద్దపేగు కీలకమైన విధులు నిర్వహిస్తుంది. ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను అది గ్రహించి శరీరానికి అందిస్తుంది. దాంతోపాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది. ఇంత ముఖ్య పనులు చేస్తున్న పెద్దపేగును వైద్యపరిభాషలో ‘కోలన్’ అంటారు. దేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది అనేక రకాల క్యాన్సర్లతో మరణిస్తున్నారు. వీటిలో ఒకటి పేగు క్యాన్సర్. అనేక సందర్భాల్లో ఇది క్యాన్సర్‎కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు చాలా ముందుగానే కనిపించడం ప్రారంభిస్తాయి..కానీ వాటిని పట్టించుకోకపోవటం, అవగాహన లేకపోవటం వల్ల పరిస్థితి తీవ్రత పెరుగుతుంది.

పెద్దపేగు క్యాన్సర్ స్త్రీల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎక్కువ నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకున్నా లేదా ధూమపానం చేసినా, ఎక్కువగా మద్యం సేవిస్తే అది క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అలాగే వారసత్వం కూడా రావొచ్చు.. మీ కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు పేగు క్యాన్సర్ ఉంటే, మీరు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించాలంటే ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. మీ ఆహారంలో ఇనుము, కాల్షియం చేర్చాలి. రోజూ వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాలి. ఈ పేగు క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయి ఈరోజు చూద్దాం.

► మలద్వారం నుంచి రక్తస్రావం అవుతూ ఉండటం.

► కొద్దిరోజులు విపరీతమైన మలబద్దకం ఉండటం… మరికొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటడం… ఈ రెండు కండిషన్లూ ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉండటం కూడా దీని లక్షణంగా చెప్పుకోవచ్చు.

► పొట్ట కింది భాగంలో నొప్పి, అక్కడ పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండటం.

► మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం.

►అకారణంగా నీరసం, బరువు తగ్గడం.

►ఆకలి లేకపోవడం

►కొంచెం తింటేనే కడుపు నిండినట్లు అనిపించటం.

ఈ క్యాన్సర్‌కు ఇవి ప్రాథమిక లక్షణాలు. ఒకవేళ మీరు పెద్దప్రేగు క్యాన్సర్‌ భారిన పడితే..మద్యం, దూమపానం అలవాటు పూర్తిగా మానేయాలి. ఈ చికిత్సలో కూడా వివిధ దశలు ఉంటాయి. ముందు కుటుంబ చరిత్రను చూస్తారు. ఆ తర్వాత సమస్య తీవ్రతను పరిగణలోకి తీసుుకంటారు. ఈ లక్షణాల్లో కొన్ని మొలల సమస్యకు ఉండే లక్షణాలు. కాబట్టి సమస్య ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి. అశ్రద్ధ చేస్తే పరిస్థితి ఇంకా కఠినతరం అవుతుంది. ఎప్పుడైనా సరే మలబద్ధకం సమస్యను అశ్రద్ధ చేయొద్దు. ఏం చేసినా సమస్య తగ్గటంలేదంటే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. చాలారోగాలకు మలబద్ధకమే మొదటి కారణం..లక్షణం కూడా.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news