గుండె పోటును క‌నిపెట్టి చెప్పే నూత‌న ఏఐ టెక్నాల‌జీ..!

-

గుండె పోటు ప‌గ‌టి స‌మయంలో వ‌స్తే ఎవ‌రో ఒక‌రు ఉండి వేగంగా స్పందిస్తారు. కానీ అదే రాత్రి పూట వ‌స్తే ఇంట్లో అంద‌రూ నిద్రిస్తుంటారు. క‌నుక అలాంటి స‌మయంలో బాధితుల‌ను చూసేవారు ఉండ‌రు.

గుండెపోటు అనేది మ‌న‌కు చెప్పి రాదు. అక‌స్మాత్తుగానే వ‌స్తుంది. అలాంటి స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. గుండెపోటు వ‌చ్చిన 1 గంట లోపే హాస్పిట‌ల్‌కు త‌రలిస్తే గుండెకు తీవ్ర న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే భ‌విష్య‌త్తులో మళ్లీ రోగికి గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు త‌ట్టుకునే శ‌క్తి కూడా ఉంటుంది. అందుకనే గుండె పోటు వ‌చ్చిన వెంట‌నే బాధితుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాల‌ని వైద్యులు చెబుతుంటారు.

అయితే గుండె పోటు ప‌గ‌టి స‌మయంలో వ‌స్తే ఎవ‌రో ఒక‌రు ఉండి వేగంగా స్పందిస్తారు. కానీ అదే రాత్రి పూట వ‌స్తే ఇంట్లో అంద‌రూ నిద్రిస్తుంటారు. క‌నుక అలాంటి స‌మయంలో బాధితుల‌ను చూసేవారు ఉండ‌రు. దీంతో ఆ స్థితిలో ఎక్కువ న‌ష్టం జ‌రుగుతుంది. చాలా సంద‌ర్భాల్లో అలాంటి స్థితిలో ప్రాణాలు పోయేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు అమెరికా సైంటిస్టులు ఓ నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. అది ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా ప‌నిచేస్తుంది.

గుండె పోటు వ‌చ్చినప్పుడు రోగి శ‌రీరం నుంచి వ‌చ్చే ప‌లు భిన్న‌మైన శ‌బ్దాల‌ను స‌ద‌రు ప‌రిజ్ఞానం గుర్తిస్తుంది. అనంత‌రం అంద‌రినీ అలర్ట్ చేస్తుంది. దీంతో రోగిని త్వ‌ర‌గా ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా గుండె పోటు వ‌చ్చిన స‌మ‌యంలో రోగికి సీపీఆర్ (కృత్రిమ శ్వాస‌) ఇస్తే బ‌తికేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే సైంటిస్టులు అభివృద్ధి చేసిన ఆ ప‌రిజ్ఞానంతో రోగికి సీపీఆర్ ఇచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో రోగికి గుండె ప‌రంగా జ‌రిగే న‌ష్టం త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌డం కొంత ఆల‌స్య‌మైనా బ‌తికేందుకు అవ‌కాశం ఉంటుంది. కాగా ఈ ప‌రిజ్ఞానంతో కూడిన డివైస్‌లు రోగికి 6 మీట‌ర్ల దూరంలో ఉన్నా 97 శాతం క‌చ్చితంగా ప‌నిచేస్తాయ‌ని స‌ద‌రు సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ ప‌రిజ్ఞానం వాణిజ్య ప‌రంగా ఎప్ప‌టి నుంచి మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news