పిల్లల్లో కాన్స్టిపేషన్ సమస్యని ఇలా దూరం చెయ్యచ్చు..!

-

తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్లను మరెంత శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి. పిల్లల చేత ఫిజికల్ యాక్టివిటీ చేయించడం, పోషక పదార్ధాలు ఇవ్వడం, నీళ్లని తాగించడం, ఒత్తిడి లేకుండా చూడడం లాంటివి చేస్తూ ఉండాలి. అయితే పిల్లలు కాన్స్టిపేషన్ సమస్యతో బాధ పడితే తల్లిదండ్రులు ఈ ఆయుర్వేద చిట్కాలతో తొలగించొచ్చు.

పిల్లల్లో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది?

తక్కువ నీళ్ళు తాగడం
జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం
బాగా రాత్రి అయిన తర్వాత ఆహారం తినడం
ఆలస్యంగా నిద్రపోవడం
సమయపాలన లేకుండా తినడం
ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడం
గట్ హెల్త్ సరిగా లేకపోవడం

పిల్లల్లో కాన్స్టిపేషన్ సమస్యని ఇలా తగ్గించండి:

ఉదయం పిల్లలు లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పట్టించండి.
నాలుగు నుండి ఐదు నానబెట్టిన ఎండు ద్రాక్షని ఇవ్వండి.
గోరువెచ్చని ఆవు పాలలో ఉదయాన్నే ఒక టీస్పూన్ ఆవు నెయ్యి వేసి ఇవ్వండి.
ఇంగువని వంటల్లో ఉపయోగించడం వల్ల గ్యాస్ సమస్యలు పిల్లలకు రాకుండా ఉంటాయి.
పచ్చి ఆహారపదార్థాలు కంటే ఉడికించిన ఆహార పదార్థాలని వాళ్ళకి అలవాటు చేయండి.

జంక్ ఫుడ్ వంటి వాటిని అస్సలు పిల్లలకి ఇవ్వద్దు.
అలానే పిల్లలు చక్కగా ఆడుకునేటట్టు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా వుండేటట్టు చూసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version