ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారో లేదో ఇలా తెలుసుకోవచ్చు..!

ఉప్పు ( Salt ): కూర, ఫ్రై, పచ్చడి మొదలు ఎన్నో వంటకాలలో మనం ఉప్పు ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఉప్పు ఆరోగ్యానికి ముప్పు మాత్రమే. ఉప్పు ఎక్కువగా ఉపయోగించడం వల్ల హైబీపీ వంటి సమస్యలు వస్తాయి. పైగా ఏది కూడా లిమిట్ దాటి తీసుకోకూడదు. లిమిట్ ని కనుక దాటారు అంటే ఖచ్చితంగా అది ఆరోగ్యానికి హాని చేస్తుంది.

salt
salt | ఉప్పు

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సీరియస్ లక్షణాలు, అనారోగ్య సమస్యలు ఉప్పు వల్ల వస్తాయి. చాలా మంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడతారు.

ప్రతి రోజు 2300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉప్పుని తీసుకోకూడదు. అదే హైబీపీతో బాధపడే వాళ్ళు రోజుకి 1500 మిల్లీగ్రాములు సాల్ట్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. హైబీపీ కారణంగా హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చు. ఇక మరి వాటి కోసం చూస్తే..

ఎక్కువగా దాహం కలగడం:

సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దాహం వేస్తుంది. బాడీలో సోడియం లెవెల్స్ పెరిగిపోవడం వలన దాహం కలుగుతుంది. ఇలా జరిగే సమయంలో కచ్చితంగా సాల్ట్ ని తగ్గించటం మంచిది.

తలనొప్పి:

సాల్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్లకి తలనొప్పి కూడా కలుగుతుంది. కనుక ఇలా కూడా మీరు తెలుసుకోవచ్చు.

ఎముకల నొప్పులు:

ఎముకలు నొప్పి కలగడం కూడా సాల్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారనే దానికి సంకేతం. ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉన్నట్టు మీరు గుర్తిస్తే తప్పకుండా సాల్ట్ ని తగ్గించండి. సాల్ట్ ని తగ్గించడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా మీరు జాగ్రత్త పడొచ్చు.