గార్గిలింగ్ చేసేటప్పుడు ఈ విధంగా అనుసరిస్తే మరెంత ప్రయోజనం…!

-

కరోనా సమయం లో చాలా మంది వేడి నీళ్లు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి చిట్కాలు వల్ల కరోనా పోగొట్టుకోవచ్చు అని వేడి నీళ్లు తాగడం ఆవిరి పట్టడం లాంటివి చేస్తున్నారు. అదే విధంగా గార్గిలింగ్ లాంటివి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే గార్గిలింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం…

గార్గిలింగ్ చేసే వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొద్దిగా గోరు వెచ్చని నీటి లో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆ నీళ్లని నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు చేయొచ్చు. అదే విధంగా పసుపు కూడా గార్గిలింగ్ లో బాగా ఉపయోగ పడతాయి. పసుపులో యాంటి సెప్టిక్ గుణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అనేక సమస్యలను పసుపు తరిమికొడుతుంది.

అలాగే ఎక్కువ పసుపు వేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. రాత్రి నిద్ర పోయేటప్పుడు గార్గిలింగ్ చేయడం వల్ల బాగా పని చేస్తుంది. మీరు ఉదయం అల్పాహారం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మరియు రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత చేస్తే మంచిదని డాక్టర్లు అంటున్నారు. మరీ ఎక్కువ వేడి ఉండే నీళ్ళ తో చేయొద్దు. మామూలు నీళ్లతో చేసినా కూడా పర్వాలేదు.

ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి:

మీరు గార్గిలింగ్ చేయాలంటే నీళ్లు బాగా మరిగిన వెంటనే రెండు స్పూన్లు పసుపు కొద్దిగా కల్లు ఉప్పు వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత గార్గిలింగ్ చెయ్యండి. ఇది బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ తో మీరు కావాలంటే స్టీమ్ చేయొచ్చు. దీని వల్ల మీకు రిలీఫ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news