ఇలా ఇంట్లోనే షేవింగ్ క్రీమ్ చేసుకోవచ్చు..!

ఇలా ఇంట్లోనే షేవింగ్ క్రీమ్ మనం తయారు చేసుకోవచ్చు. పైగా ఇందులో కెమికల్స్ కూడా ఉండవు. దీనితో మగవాళ్ళు కెమికల్స్ ఫ్రీ షేవింగ్ క్రీమ్ తో షేవ్ చేసుకోవడం. దీని వల్ల చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అయితే మరి షేవింగ్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

 

ఇంట్లో షేవింగ్ క్రీమ్ తయారు చేయడానికి మనకి ఈ చిన్నచిన్న పదార్థాలు అవసరం పడతాయి. వాటి కోసం చూసేస్తే..

హోమ్ మేడ్ షేవింగ్ క్రీమ్ కి కావలసిన పదార్ధాలు:

1/3 కప్పు షియా బటర్
1/3 కప్పు కొబ్బరి నూనె
1/3 కప్పు ఆలివ్ ఆయిల్
7 నుండి 10 చుక్కల పిప్పరమింట్ ఆయిల్
లావెండర్ ఆయిల్ 4-5 చుక్కలు
మైక్రోవేవ్ బౌల్
టూత్ పిక్

తయారు చేసుకునే పద్ధతి:

దీని కోసం మొదట షీ బట్టర్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. దానిని మైక్రోవేవ్ బౌల్లో వేసి మైక్రోవేవ్ లో ఒక నిమిషం పాటు ఉంచాలి.

ఆ తర్వాత కొద్దిగా లావెండర్ మరియు పిప్పరమెంట్ ఆయిల్ వేసి తర్వాత ఆలివ్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేయాలి.

టూత్ పిక్ సహాయంతో వీటిని అన్నింటిని బాగా మిక్స్ చేయాలి. ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఫ్రిజ్లో పెట్టాలి. రెండు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచి చల్లగా ఉంచండి.

ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి హ్యాండ్ గ్రైండర్ తో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు బీట్ చేయాలి. అంతే ఇలా ఎంతో సింపుల్ గా మనం షేవింగ్ క్రీమ్ ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు.