Business Ideas : తక్కువ పెట్టుబడితో అదిరిపోయే లాభాల్ని ఇచ్చే బిజినెస్ ఐడియాస్

-

మీరు మంచి బిజినెస్ ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారా..? అయితే తక్కువ పెట్టుబడితో అదిరిపోయే లాభాల్ని ఇచ్చే బిజినెస్ ఐడియాస్ (Business ideas) గురించి ఇప్పుడే చూసేయండి. వీటిని కనుక మీరు అనుసరిస్తే తప్పకుండా మంచిగా లాభాన్ని పొందవచ్చు. ఇక ఆ బిజినెస్ ఐడియాస్ గురించి చూస్తే..

 

ఆర్టిఫిషియల్ జ్యూవెలరీ :

ఎక్కువగా మగువలు ఆర్టిఫిషియల్ జువెలరీ కొనుగోలు చేస్తారు. పైగా వీటికి డిమాండ్ కూడా ఎక్కువే. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఈ బిజినెస్ చేయొచ్చు.

దీని వల్ల మీకు అదిరిపోయే లాభాలు వస్తాయి. బెంగళూరు బేస్డ్ జ్యువలరీ బ్రాండ్ ఇమిటేషన్ జ్యువలరీ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉందని చెబుతోంది.

పైగా దీని కోసం మీరు 15 వేల రూపాయల నుండి 20 వేల రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఇలా మీరు ఆర్టిఫిషియల్ జ్యూవెలరీ బిజినెస్ స్టార్ట్ చెయ్యచ్చు.

బేకరీ:

బేకరీని ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు. బేకింగ్ లో మీకు మంచి స్కిల్స్ ఉంటే ఇది బాగా వర్కవుట్ అవుతుంది. పైగా దీని కోసం మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. కేవలం ఓవెన్ కొనుగోలు చేయడానికి మరియు ఇతర బేకింగ్ సామాన్లని కొనుగోలు చేయడానికి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.

చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే బేకరీని మొదలు పెడుతున్నారు. మీరు వీటిని సేల్ చెయ్యడానికి ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ ని ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు 15 వేల రూపాయల నుండి 25 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా కూడా అదిరిపోయే రాబడి మీరు పొందవచ్చు.

హోమ్ మేడ్ కొవ్వొత్తులు:

చాలా మంది మంచి సువాసనను ఇచ్చే కొవ్వొత్తులని ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఇటువంటి అందమైన కొవ్వొత్తులు తయారు చేసి మంచిగా క్యాష్ చేసుకోవచ్చు.

పైగా ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. దీని కోసం మీరు సువాసననిచ్చే నూనెల్ని, దారాలు, వ్యాక్స్ వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వీటిని కూడా మీరు ఆన్లైన్ ద్వారా అమ్మచ్చు లేదు అంటే షాపులకు ఇవ్వొచ్చు. ఇలా ఈ సింపుల్ బిజినెస్ తో కూడా మీరు మంచి రాబడి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news