ఇంట్లో సమస్యలేమీ లేకుండా శుభ్రంగా ఉండడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది అస్తమాను మనం అన్ని సర్దుకుంటూ ఉండాలి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే.. దాని వలన ఎంతగానో తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక సారి చీమల పట్టినా లేకపోతే ఈగలు ఎక్కువ వున్నా శుభ్రం చేసుకోవడం కష్టం అవుతుంది, మీ ఇంట్లో కూడా చీమలు ఎక్కువగా ఉన్నాయా అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి ఇలా చేస్తే చీమలు పారిపోతాయి.
కారంతో ఈజీగా మనం చీమలు రాకుండా చేసేయొచ్చు కారం ని నీటి లో కలిపి చీమలు ఎక్కువగా పట్టే చోట స్ప్రే చేయండి ఇలా చేస్తే త్వరగా చీమలు పారిపోతాయి. చీమలు ఎక్కువగా ఉన్నట్లయితే తులసి కర్పూరం నీళ్లల్లో వేసి చీమలు తిరిగే చోట స్ప్రే చేయండి ఇలా చేస్తే చీమలు పోతాయి. ఒక స్ప్రే బాటిల్ తీసుకుని తులసి ఆకుల రసం కర్పూరం నీళ్లు వేసి స్ప్రే చేస్తూ ఉండండి అప్పుడు చీమలు పారిపోతాయి.
వేడి నీళ్ల ద్వారా కూడా ఈజీగా చీమలని తొలగించొచ్చు చీమలు పుట్టలు పెట్టిన చోట వేడి నీటిని వేయండి అప్పుడు చీమలు పారిపోతాయి. మొక్కజొన్న పిండితో కూడా చీమలు లేకుండా చేయొచ్చు. చీమలు ఉండే చోట కొంచెం మొక్కజొన్న పిండి చల్లండి. తర్వాత నీరు పోయండి దీంతో చీమలు అక్కడికి రావు.
కాఫీ పొడి తో కూడా మీరు ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు చీమలు తిరిగే చోట కాఫీ పొడిని కనుక జల్లితే చీమలు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. వేప నూనెను కూడా స్ప్రే చేయొచ్చు చీమలు తిరిగే చోట మీరు వేప నూనె వేస్తే చీమలు చచ్చిపోతాయి. చీమలు తిరిగే చోట మీరు వెనిగర్ ని వేస్తే చీమలు అక్కడి నుండి వెళ్ళిపోతాయి, యూకలిప్టస్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో చీమలని దూరం చేసేయొచ్చు.