వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. వాటర్ ను ఇలా తాగితే సరి..!

-

సమ్మర్ లో వడదెబ్బకు గురవ్వడం చాలా సాధారణంగా జరుగుతుంది. అయితే దీని తీవ్రత ఎక్కువైతే.. ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింటుంది. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవ్వొచ్చు. పదవ తరగతి విద్యార్థి సైతం తాజాగా వడదెబ్బతగిలి చనిపోయాడు. మరీ ఈ పరిస్థితుల్లో.. వడదెబ్బ తగిలేంత ఎండ అంటే ఏ రేంజ్ లో ఉంటుంది, వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే.. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఈరోజు చూద్దాం.
40 డిగ్రీల ఎండ వరకూ బాడీ తట్టుకుంటుంది. 40 దాటితే కొంచెం వేడిగాలి ఉంటుంది. ఇక 45 డిగ్రీలు ఎండ దాటిందంటే.. వడగాలి, విపరీతంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం బయటకు వెళ్లినప్పుడు మనలోపల ఉండే నీరు అంతా చెమట రూపంలో మారి బాడీని చల్లబర్చడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు రెండు లీటర్లు నీరు ఆవిరైపోతుంది. లాస్ అవుతున్న నీటిని తిరిగి అందించగలిగితే.. పెద్దగా ఎండ ప్రభావం ఉండదు. కానీ నీళ్లు ఎక్కువ తాగితే.. పొట్ట ఉబ్బినట్లు అనిపించి.. వికారంగా ఉంటుంది.. ఇక ఆ టైంలో వాటర్ ఎక్కువ తాగాలనిపించదు. దాంతో.. ఓ పక్క బాడీలో ఉన్న వాటర్ చెమటలా అయిపోతుంది.. మీరు తిరిగి వాటర్ తాగకుండా ఉన్న పరిస్థితుల్లో.. బాడీలో కొన్ని కెమికల్ మార్పులు వస్తాయి. నీళ్లు తగ్గే సరికి రక్తం చిక్కబడుతుంది. బ్రెయిన్ సర్కూలేషన్ తగ్గుతుంది. బీపీ తగ్గిపోతుంది, తలనొప్పి మొదలవుతుంది. కళ్లు తిరగడం, నోరు మంట ఇవన్నీ వస్తాయి. దీంతో మనం ఇక వడదెబ్బ తగిలింది అని ఫిక్స్ అయిపోతాం.

ఎండలోకి వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలోకి వెళ్లేముందు బాడీని ప్రీపేర్ చేసి వెళ్తే.. మండుటెండలోకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పనులు చక్కపెట్టుకుని రావొచ్చు. డీహైడ్రేట్ వల్ల పైన చెప్పిన సమస్యలు అన్నీ వస్తాయి. కాబట్టి.. టిఫెన్ తిన్న రెండు గంటల తర్వాత 4-5గ్లాసులు వాటర్ తాగండి. అన్ని వాటర్ పట్టే బాటిల్ ను పక్కన పెట్టుకోని వెళ్లాలని గుర్తుంచుకోండి. మళ్లీ ఆ వాటర్ కూడా ఒకేసారి తాగకూడదు. గ్యాప్ ఇచ్చి గ్లాస్ చొప్పున తాగండి. బాడీలో వాటర్ ఇలా సరిపడా ఉంటే.. చెమట రూపంలో కరిగే వాటర్ ను మనం తిరిగి అందిస్తున్నాం కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు.
మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు వీలైనంత వరకూ వాటర్ తాగకండి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత నుంచి.. 20నిమిషాలు గ్యాప్ ఇస్తూ.. మళ్లీ 4-5 గ్లాసులు నీళ్లు తాగేలా ప్లాన్ చేసుకుంటే.. అంటే.. రోజు మొత్తంలో.. పది గ్లాసులు చొప్పున తాగితే.. వడదెబ్బ బారిన పడుకుండా ఉండొచ్చు. వాటర్ తాగమన్నారు కదా.. ఒకేసారి పొట్టపట్టకుండా తాగేస్తే అయిపోతుంది అనుకుంటారు చాలామంది.. వాటర్ ను ఒక పద్దతిలో.. టైం ప్రకారం తాగాలి. సాధారణంగా.. భోజనం చేసే టైంలో వాటర్ ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. భోజనం చేస్తూ వాటర్ తాగే అలవాటు వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. నెమ్మదిగా తింటే ఎక్కిళ్లు రావు.. తిన్నాక నోట్లో నీరు పోసుకుని పొక్కిలిస్తే.. మీకు వాటర్ తాగాలన్న ఫీల్ కూడా పోతుంది. భోజనం అయిన రెండు గంటల తర్వాత నుంచి వాటర్ తాగడం మొదలుపెట్టాలి.
ఇలా ప్లాన్ చేసుకుంటే.. ఎండలో వెళ్లినప్పుడు తలనొప్పి, వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news