పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా..? ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారా..? ఈ మధ్య కాలంలో ఎక్కువమంది పేగుల సమస్యలతో బాధపడుతూ వుంటున్నారు. పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మీరు దీనిని చూడాల్సిందే.

జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే పేగులు సరిగ్గా పని చేయవు. పేగుల ఆరోగ్యం మనం తినే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకోండి. కొన్ని ఆహార పదార్థాలు మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తాయి. దీనితో పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి పేగుల ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.

ఫ్రై చేసిన ఆహారం:

ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కడుపులో టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి.

మాంసం:

మాంసం కూడా పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పాల ఉత్పత్తులను తీసుకోవడం మాంసాన్ని తీసుకోవడం వలన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా తొలగిపోతుంది. పేగుల్లో మంట కూడా వస్తుంది.

మైదా:

మైదాని తీసుకోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. మైదాలో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది కూడా.

పంచదార:

పంచదారని ఎక్కువ తీసుకోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. మీరు మీ పేగులని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పంచదారకు దూరంగా ఉండటం మంచిది.

ప్రోబయోటిక్స్:

శరీరానికి సరిపడా ప్రోబయోటిక్స్ ని తీసుకోకపోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం పాడవుతుంది.

యాంటీబయటిక్స్:

ఎక్కువ యాంటీబయటిక్స్ ని తీసుకోవడం వలన పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే గుడ్లు ఎక్కువ తీసుకోవడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం తాగడం వలన కూడా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఈ తప్పులు చేయొద్దు. చేతులారా మీరు మీ పేగుల ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.

Read more RELATED
Recommended to you

Latest news