రోజూ వైన్ తాగితే.. ఎక్కువ కాలం బ‌తుకుతార‌ట తెలుసా..?

-

ఆల్క‌హాల్‌ను రోజూ సేవిస్తే ఆరోగ్యానికి హానిక‌ర‌మే. ఎందుకంటే మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ పాడవుతుంది. కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అందుక‌ని మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని వైద్యులు చెబుతారు. అయితే అదే వైద్యులు ప‌రిమిత మోతాదులో మ‌ద్యం సేవిస్తే ఆరోగ్యానికి లాభ‌మే ఉంటుంద‌ని కూడా చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే వైన్ తాగ‌మ‌ని కూడా మ‌న‌కు సూచిస్తుంటారు. అయితే వైన్ అయినా నిత్యం ఒక‌టి రెండు పెగ్గుల‌కు మించ‌కూడ‌దు. త‌క్కువ మోతాదులో తాగితేనే మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం వైన్ తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిత్యం వైన్ తాగితే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ట‌. రక్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

2. వైన్ తాగ‌డం వ‌ల్ల ఎక్కువ కాలం బ‌తుకుతార‌ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. వైన్ తాగ‌డం వ‌ల్ల ఆయుష్షు పెరుగుతుంద‌ట‌.

3. వైన్ తాగ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావ‌ని హార్వ‌ర్డ్ మెడికల్ స్కూల్ సైంటిస్టులు చెబుతున్నారు.

4. వైన్ తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం సురక్షితంగా ఉంటుంద‌ట‌. ఎండ‌లో తిరిగినా చ‌ర్మానికి ఏమీ కాద‌ట‌.

5. రోజూ వైన్ తాగితే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 30 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

Read more RELATED
Recommended to you

Latest news