కేటిఆర్ యంగ్ ఫోటో చూసారా…?

-

తెలంగాణా రాజకీయాల్లో తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్న నాయకుల్లో మంత్రి కేటిఆర్ ఒకరు. తనదరి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న కేటిఆర్ తక్కువ కాలంలోనే తన సామర్ధ్యం ఏంటో చూపించారు. తెలంగాణా ఉద్యమంతో పాటుగా ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం తెరాస పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

తన తండ్రికి తగ్గ రాజకీయ వ్యూహకర్తగా కూడా కేటిఆర్ సత్తా చాటుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయితి, మున్సిపల్ ఇలా ఏ ఎన్నికల్లో అయినా సరే తెరాస పార్టీని ముందు ఉండి నడిపిస్తూ తన సత్తా చాటుతున్నారు కేటిఆర్. ఇక ఇదిలా ఉంటే ఆయన సోషల్ మీడియాలో ఏ స్థాయిలో యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తాజాగా కేటిఆర్ ఇంటర్‌నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

1998వ సంవత్సరంలో ఈ లైసెన్సు అందుకున్నట్టుగా పేర్కొన్న కేటీఆర్ ఆనాటి ఫోటోను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ఇది గత మిల్లీనియం జ్ఞాపకం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఇంటర్నేషనల్ లైసెన్స్ పర్మిట్‌పై ఉన్న ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.. నెటిజన్లు విద్యార్థి దశలోని ఈ ఫోటో బాగుందంటూ లైక్‌లు కొడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news